నందమూరి వారసుడు డైలమాలో పెట్టేసాడు..!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కె.ఎస్.రవికుమార్ డైరెక్షన్లో తన 105 వ చిత్రం చేయడానికి రెడీ అవుతున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘జై సింహా’ చిత్రం హిట్టయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా… బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య సినిమాలకు సంబంధించి ఏ వేడుక జరిగినా… అందులో మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఏమైనా క్లారిటీ ఇస్తారేమో అని ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు.

nandhamuri-fans-are-in-dilemma1

nandhamuri-fans-are-in-dilemma2

అయితే బాలయ్య మాత్రం ఇప్పటి వరకూ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. మోక్షజ్ఞ కూడా పెద్దగా బయట కనిపించకపోవడం, అలాగే డాన్సులు, ఫైట్లలో శిక్షణ తీసుకుంటున్నాడు అనే ప్రచారం జరగడంతో… హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి మోక్షజ్ఞ రెడీ అవుతున్నదని అని అందరూ ఆశించారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో మోక్షజ్ఞ రీసెంట్ ఫోటోలు కొన్ని బయటికొచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఫోటోలను చూసిన వారంతా… మోక్షజ్ఞ ఎంట్రీ పై రకరకాలుగా చర్చించుకుంటున్నారు. అసలు మోక్షజ్ఞకి సినిమాల్లోకి వచ్చే ఆలోచనే లేదనే అనుమానాలు వ్యక్తం చేస్తుండడం గమనార్హం. ఇటీవల మోక్షజ్ఞకు సినిమాలంటే పెద్దగా ఆసక్తి లేదని.. వ్యాపార రంగం మీదే ఎక్కువ ఆసక్తి ఉందని… వార్తలు వచ్చాయి. మరి వీటిలో ఏది నిజమో తెలీక.. బాలయ్య అభిమానులతో పాటూ సినీప్రేక్షకులు కూడా డైలమాలో పడ్డారు. మరి ఈ విషయం పై బాలయ్య క్లారిటీ ఇస్తే తప్ప ఓ కొలిక్కి వచ్చేలా లేదు.

Share.