కొత్త దర్శకుడితో మొదలెట్టిన సినిమా ఆపేసిన గోపీచంద్

“సౌక్యం” మొదలుకొని “చాణక్య” వరకూ గోపీచంద్ నటించిన ప్రతి సినిమా డిజాస్టర్ గా నిలిచింది. మధ్యలో “ఆరడుగుల బుల్లెట్” సినిమా అయితే కనీసం విడుదలవ్వలేదు కూడా. దాంతో గోపీచంద్ కెరీర్ గ్రాఫ్ మాత్రమే కాక మార్కెట్ కూడా పూర్తిస్థాయిలో డౌన్ అయిపోయింది. మరి తన కారణంగా నిర్మాతలు ఇంక నష్టపోకూడదు అనుకున్నాడో లేక.. అనవసరమైన రిస్క్ ఎందుకులే అనుకున్నాడో ఏమో కానీ.. ఉన్నపళంగా కొత్త సినిమా ఆపేశాడు.

Aaradugula Bullet Movie Poster

ఓ రెండు నెలల క్రితం గోపీచంద్ హీరోగా బివిఎస్.ఎన్ ప్రసాద్ మొదలెట్టిన ఓ హై బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ ను గోపీచంద్ అభీష్టం మేరకు బివిఎస్.ఎస్ ప్రసాద్ ఆపేశారట. దాంతో ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా మాత్రమే గోపీచంద్ చేతిలో ఉంది. ఆ సినిమా మీద గోపీ కెరియర్ ఆధారపడి ఉంది.

17 ఏళ్ళ కెరీర్లో ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలేంటో తెలుసా..?
వయసుకు మించిన పాత్రలు చేసి మెప్పించిన టాలీవుడ్ హీరోలు..!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.