వరుణ్ తేజ్ సినిమా టైటిల్ కొట్టేసిన గోపీచంద్..!

యక్షన్ హీరో గోపీచంద్ ఇప్పుడు ‘చాణక్య’ చిత్రంతో ప్రేక్షకులు ముందుకు రావడానికి రెడీ అయ్యాడు. అక్టోబర్ 5న(రేపు) విడుదల కాబోతుంది ఈ చిత్రం. ఇదిలా ఉండగా.. ఇప్పుడు గోపీచంద్ మెగా హీరో టైటిల్ పై కన్నేసాడట. ఆ మెగా హీరో మరెవరో కాదు ఈ మధ్యే ‘గద్దలకొండ గణేష్’ సినిమాతో హిట్టందుకున్న వరుణ్ తేజ్. అయినా వరుణ్ తేజ్ ఎంట్రీ ఇచ్చి ఐదేళ్ళు కూడా పూర్తి కాలేదు. అలాంటప్పుడు వరుణ్ తేజ్ సినిమా టైటిల్ ను గోపీచంద్ కొట్టేయడం ఏంటి అని అనుకుంటున్నారా..?

varun-tej-gopichand

అసలు విషయం ఏమిటంటే.. గోపీచంద్ హీరోగా సంపత్ నంది డైరెక్షన్లో ఓ చిత్రం రాబోతుంది. గతంలో కూడా వీళ్ళిద్దరి కాంబినేషన్లో ‘గౌతమ్ నంద’ సినిమా వచ్చింది. ఈ చిత్రం పెద్ద డిజాస్టర్ అయ్యింది. అయినప్పటికీ ఈసారి హిట్టు కొట్టాలనే కసితో మరో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ‘సీటీమార్’ అనే టైటిల్ ఫిక్స్ చేయబోతున్నారట. ఈ చిత్రంలో గోపీచంద్.. ఆంధ్రా ఫీమేల్ కబడ్డీ కోచ్‌గా … ఇక తెలంగాణ ఫీమేల్ కోచ్‌గా తమన్నా కనిపించబోతుంది. సో ఈ చిత్రం స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోంది కాబట్టే ఈ సినిమాకు ‘సీటీమార్’ అనే టైటిల్ రిజిష్టర్ చేయించినట్టు తెలుస్తుంది. ఇక ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో వరుణ్ తేజ్ తో ‘సీటిమార్’ అనే చిత్రాన్ని చేస్తాడు రెండో హీరో అధర్వ మురళి. ఇపుడు అదే టైటిల్‌ తో నిజంగానే గోపీచంద్ సినిమా రాబోతుంది.

సైరా నరసింహారెడ్డి చిత్రంలోని పవర్ ఫుల్ డైలాగ్స్
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!

Share.