ఆయన ఎన్టీఆర్ అయితే…కీర్తి సావిత్రి అట..!

అదృష్టం అంటే కీర్తి సురేష్ దే, ఆమె కెరీర్ సూపర్ బ్యాలెన్స్ తో దూసుకువెళుతుంది. అటు స్టార్ హీరోల పక్కన సినిమాలు చేస్తూనే మరో ప్రక్క లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తుంది. మహేష్ చేస్తున్న భారీ చిత్రం సర్కారు వారి పాట మూవీలో హీరోయిన్ గా అవకాశం దక్కించుకున్న ఆమె, నితిన్ కి జంటగా రంగ్ దే చిత్రంలో నటిస్తుంది. అలాగే మిస్ ఇండియా అనే ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తుంది. కాగా కీర్తి సోలోగా చేస్తున్న మరో చిత్రం గుడ్ లక్ సఖి.

ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడిగా పేరున్న నగేష్ కుకునూర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ టీజర్ నేడు విడుదలైంది. ఈ చిత్ర తెలుగు టీజర్ ని రెబెల్ స్టార్ ప్రభాస్ విడుదల చేయడం విశేషం. కాగా ఈ చిత్ర టీజర్ ఎలా ఉందో చూద్దాం.. ఓ మారుమూల పల్లెటూరిలో దురదృష్టవంతురాలిగా పేరుపడ్డ ఓ అమ్మాయి, దేశం మెచ్చే షూటర్ గా ఎలా ఎదిగింది అనేదే ఈ మూవీ కథని టీజర్ తెలియజేస్తుంది. ఊరంతా ఆమెను నష్టజాతకురాలు అంటున్నా, తనపాటికి తాను హ్యాపీ లైఫ్ అనుభవించే అమ్మాయిగా కీర్తి పాత్ర ఉంది.

ఇక నాటకాలబ్బాయిగా హీరో ఆది కనిపిస్తున్నాడు. సినిమాలో రొమాంటిక్ యాంగిల్ ఆది మరియు కీర్తి సురేష్ ల మధ్యే అని తెలుస్తుంది. దేశం మెచ్చే షూటర్స్ ని తయారు చేయాలని లక్ష్యంతో పనిచేసే కోచ్ గా జగపతి బాబు పాత్ర కనిపిస్తుంది. ఓ ప్రొఫెషనల్ షూటింగ్ స్పోర్ట్స్ కోసం ఎక్కడో ఓ పల్లెటూరిలో ఉన్న కీర్తిని జగపతిబాబు ఎందుకు ఎంచుకున్నాడు అనేది మూవీలోని అసలు ట్విస్ట్. మరి కోచ్ శిక్షణలో అద్భుత విజయాలు సాధించి తాను బ్యాడ్ లక్ సఖి కాదు గుడ్ లక్ సఖి అని, కీర్తి ఎలా నిరూపించుకుంది అనేది వెండితెరపై చూడాలి. మొత్తంగా టీజర్ అద్భుత పాత్రలతో అంచనాలు పెంచేలా ఉంది.

Share.