తారక్ ఫ్యాన్స్ కు డబుల్ ఫీస్టే.. కానీ..!

రాజమౌళితో ఏ హీరో సినిమా చేయడానికి కమిట్ అయినా.. ఆ హీరో అభిమానులకి మాత్రం ఏళ్లకు తరబడి ఎదురుచూపులు తప్పడం లేదు. కచ్చితంగా తన సినిమా రెండేళ్ల వరకూ రిలీజ్ చెయ్యడు.. షూటింగ్ పూర్తయినా .. చెక్కుతూనే ఉంటాడు. ఒకవేళ హీరో మరో డైరెక్టర్ తో సినిమా కమిట్ అయినా.. ఆ సినిమా షూటింగ్ రాజమౌళి సినిమా షూటింగ్ కంటే ముందే పూర్తయినా.. విడుదల చేయడానికి మాత్రం రాజమౌళి అంగీకరించడు అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

RRR Movie New Still

ఈ విషయాన్ని పక్కన పెడితే.. కొద్దిసేపటి క్రితమే ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా ఉంటుందని ట్విట్టర్లో ప్రకటించారు. ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్ మరియు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్ల పై కళ్యాణ్ రామ్, రాధాకృష్ణ లు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది ఎన్టీఆర్ కు 30 వ చిత్రం. ఈ చిత్రం షూటింగ్ మే లో మొదలు కాబోతుందట. అంటే ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా షూటింగ్ ముందే పూర్తయిపోయే అవకాశం ఉంది. కానీ త్రివిక్రమ్, ఎన్టీఆర్ ల చిత్రం వచ్చే ఏడాది అంటే 2021 ఏప్రిల్ లో విడుదల కాబోతున్నట్టు కూడా ప్రకటించారు నిర్మాతలు. ఈ మధ్య త్రివిక్రమ్ 6 నెలల్లోపు షూటింగ్ ను కంప్లీట్ చేసేసి విడుదల చేసేస్తున్నాడు. కానీ ఈసారి ఏకంగా ఏడాది వరకూ టైం తీసుకోవడంతో చర్చనీయాంశం అయ్యింది.

ఫుల్ స్క్రిప్ట్ రెడీగా ఉంది 3 నెలల్లోనే షూటింగ్ పూర్తి చేసే అవకాశం కూడా ఉందట. మరో 2 నెలలు పోస్ట్ ప్రొడక్షన్ అనుకున్నా నవంబర్ కు రిలీజ్ చేసెయ్యొచ్చట. కానీ రాజమౌళి వల్లే ఈ చిత్రం 2021 ఏప్రిల్ వరకూ రిలీజ్ అయ్యే అవకాశం లేదని తెలుస్తుంది. ఎన్టీఆర్ సినిమానే కాదు.. చరణ్ నటిస్తున్న చిరు, కొరటాల పరిస్థితి కూడా అంతేనట. ఏదేమైనా.. రెండేళ్ల వరకూ ఎన్టీఆర్ నుండీ సినిమా రాకపోవడానికి రాజమౌళి కారణమని తెలుస్తుంది. ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం 2021 జనవరి 8న విడుదల కాబోతుంది.


వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రివ్యూ & రేటింగ్!
పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
ఒక చిన్న విరామం సినిమా రివ్యూ & రేటింగ్!

Share.