మర్చిపోయిన స్టూడెంట్ లీడర్ చరిత్ర చిచ్చు పెట్టేలా ఉంది!

జార్జ్ రెడ్డి అని ఎవరు అని సడన్ గా అడిగితే చాలా వరకూ తెలియదు అనే సమాధానమే వస్తుంది. కానీ.. ఇదే ప్రశ్న ఉస్మానియా ఉనివర్సిటీ దరిదాపుల్లో నిల్చుని అడిగితే.. పక్కన ఉన్న పది గొంతుకలు ఒక్కసారిగా “లీడర్” అని అరుస్తాయి. ఒక యూనివర్సిటీ విద్యార్ధిగా, విద్యార్ధి నాయకుడిగా జార్జ్ రెడ్డి సృష్టించిన చరిత్ర అలాంటిది. ఒక 30, 40 మంది గ్యాంగ్ వచ్చి అతడ్ని చంపారంటేనే అర్ధం చేసుకోవచ్చు.. అతడు సృష్టించిన భయం ఎలాంటిదో. అలాంటి పవర్ ఫుల్ వ్యక్తి జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమా “జార్జ్ రెడ్డి”. “దళం” ఫేమ్ జీవన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో టైటిల్ పాత్రలో వంగవీటి ఫేమ్ సాండీ పోషిస్తున్నాడు.

george-reddy-trailer

ఈ చిత్రం ట్రైలర్ ను దసరా కానుకగా నిన్న విడుదల చేశారు. ఎవరూ ఊహించని రీతిలో ట్రైలర్ క్వాలిటీ, కంటెంట్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకొన్నాయి. యూనివర్సిటీల్లో కులాలను బట్టి విద్యార్ధులను ట్రీట్ చేయడం, పోరాడిన విద్యార్ధుల స్కాలర్ షిప్ లను ఆపేయడం వంటి విషయాలను చాలా స్పష్టంగా చూపించారు ట్రైలర్ లోనే. త్వరలోనే సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతుండడంతో.. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా కూడా ట్రైలర్ స్థాయిలో ఉంటే.. తెలుగు మరో సెన్సేషనల్ సినిమా కావడం ఖాయం. ఇకపోతే.. మణిరత్నం తెరకెక్కించిన “యువ” సినిమాలోని సూర్య పోషించిన పాత్ర జార్జ్ రెడ్డి స్ఫూర్తిగా తీసుకోవడం గమనార్హం.

ఎవ్వ‌రికీ చెప్పొద్దు సినిమా రివ్యూ & రేటింగ్!
సైరా సినిమా రివ్యూ & రేటింగ్!

Share.