టాలీవుడ్ లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న జెనీలియా!

బొమ్మరిల్లు బ్యూటీ జెనీలియాను మన తెలుగు ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోరు. “బొమ్మరిల్లు” చిత్రంతో క్లాసిక్ హిట్ అందుకున్న జెనీలియా.. అనంతరం “ఢీ, రెడీ” సినిమాతో సెన్సేషనల్ హిట్స్ ను కూడా రుచి చూసింది. తెలుగులో వెంకటేష్, అల్లు అర్జున్, రామ్ చరణ్, రాణా, ఎన్టీఆర్ ల సరసన నటించి స్టార్ హీరోయిన్ హోదాను కూడా ఎంజాయ్ చేసింది. రాణా సరసన నటించిన “నా ఇష్టం” జెనీలియా తెలుగులో కనిపించిన ఆఖరి చిత్రం. ఆ తర్వాత అమ్మడు రితేష్ ను ప్రేమించి పెళ్లాడడంతో సినిమాలకు దూరమైంది.

genelia-latest-stills

అయితే.. ఇప్పుడు ఒక పాపకు తల్లి కూడా అయిన జెనీలియా మళ్ళీ టాలీవుడ్ లో ఎంట్రీ కోసం రెడీ అవుతోందని వినికిడి. తల్లిగా ఒక బిడ్డకు జన్మనిచ్చిన అనంతరం మళ్ళీ జిమ్ చేసి బ్యాక్ టు షేప్ కి వచ్చేసిన జెనీలియా ఇప్పుడు టాలీవుడ్ కు ఎర వేస్తోంది. చూడ్డానికి ఇంక చిన్న పిల్లలాగే ఉండే జెనీలియాకు తెలుగులో ప్రస్తుతం మార్కెట్ లేకపోయినా.. గుర్తింపు మాత్రం గట్టిగానే ఉంది. మరి జెనీలియా చేసే ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుంది అనేది చూడాలి.

1

genelia-latest-stills1

2

genelia-latest-stills2

3

genelia-latest-stills3

4

genelia-latest-stills4

5

genelia-latest-stills5

6

genelia-latest-stills6

7

genelia-latest-stills7

8

genelia-latest-stills8

9

genelia-latest-stills9

10

genelia-latest-stills10

Share.