ఆసుపత్రిలో గంగవ్వ..ఆందోళనలో అభిమానులు..!

తాజాగా గంగవ్వ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ఫోటోని చూసిన ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అసలు ఏమి జరిగిందా అని ఆరా తీస్తే.. గంగవ్వ మోకాళ్ళ నొప్పులకు చికిత్స చేయించుకోవడానికి ఓ ఆయుర్వేదిక హాస్పిటల్లో చేరిందట. అక్కడ తీసిన ఫోటో అదని తెలుస్తుంది.కొద్ది రోజుల నుండీ ఆమె తీవ్ర మోకాళ్ళ నొప్పులతో బాధపడుతుందట. అందుకే సన్నిహితుల సాయంతో హాస్పిటల్ లోకి చేరినట్టు తెలుస్తుంది.

ఆమెకు ఏమీ కాకూడదని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. యూట్యూబ్ ఛానల్స్ లో వీడియోలు చేస్తూ ఫేమస్ అయిన గంగవ్వ.. గతేడాది ‘బిగ్ బాస్4’ లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తొలుత ఈ షో నిర్వాకులు మొత్తం గంగవ్వ ప్రోమోలనే విడుదల చేసేవారు అంటే ఆమె ఏంటన్నది అర్థం చేసుకోవచ్చు. కచ్చితంగా ఈమెనే విన్నర్ కావాలని ఆమె అభిమానులు కోరుకున్నారు. కానీ అనారోగ్యం సమస్యలతో కొద్ది రోజులకే ఈమె హౌస్ నుండీ బయటకి వచ్చేసింది.

అయినప్పటికీ ఈమెకి ఇల్లు కట్టిస్తానని.. హోస్ట్ నాగార్జున మాట ఇచ్చారు. ఆయన చెప్పినట్టుగానే ఆమెకు ఇల్లు కట్టించారని తెలుస్తుంది. ఇక ‘బిగ్ బాస్4’ లో పాల్గొన్నందుకు ఈమె పారితోషికం కూడా భారీగానే అందుకుందట. దాదాపు రూ.20 లక్షల వరకూ ఈమె పారితోషికం అందుకున్నట్టు తెలుస్తుంది. ఇక ‘బిగ్ బాస్4’ లో పాల్గొన్న తరువాత ఈమె యూట్యూబ్ ఛానల్ మరింతగా పాపులర్ అయ్యిందని కూడా స్పష్టమవుతుంది.


పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Share.