నాని ఈ ఏడాది మరో హిట్టు కొట్టేలా ఉన్నాడు..!

నేచురల్ స్టార్ నాని హీరోగా విక్రమ్ కుమార్ డైరెక్షన్లో వస్తున్న చిత్రం ‘నానీస్ గ్యాంగ్ లీడర్’. సక్సెస్ ఫుల్ బ్యానర్ ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. అనిరుథ్ సంగీతమందిస్తున్న ఈ చిత్రంలో ‘ఆర్.ఎక్స్.100’ హీరో కార్తికేయ విలన్ గా నటిస్తున్నాడు. టీజర్, పాటలతోనే ఈ చిత్రం పై మంచి హైప్ ఏర్పడింది. సెప్టెంబర్ 13 న ఈ చిత్రం విడుదల కానుంది. ఇక ప్రమోషన్లలో భాగంగా ట్రైలర్ ను విడుదల చేశారు.

nanis-gang-leader-movie-trailer-review1

డిఫరెంట్ కాన్సెప్ట్ లు ఎంచుకుని తన మేజికల్ స్క్రీన్ ప్లే తో సీట్లకి కట్టి పడేసే దర్శకుడు విక్రమ్ కుమార్ ఈసారి కూడా అలాంటి వైవిధ్యమైన కాన్సెప్ట్ నే ట్రైలర్ చూస్తే స్పష్టమవుతుంది. రివేంజ్ స్టోరీలు రాసే ఓ రైటర్ పెన్సిల్ పార్థసారథి (నాని). కొని పరభాషా చిత్రాలు చూసి అందులోని కథల్ని కాపీ కొట్టి పుస్తకాలుగా రాస్తుంటాడు. ఎక్కువ రివేంజ్ కథలే రాస్తుంటడు కాబట్టి… అతని పుస్తకాలు చదివిన ఓ ఐదుగురు ఆడవాళ్ళు… రివేంజ్ తీర్చుకోవాలి అనే ఉద్దేశంతో ‘పెన్సిల్’ దగ్గరకు వచ్చి తిష్ట వేస్తారు. ఈ క్రమంలో పెన్సిల్ వాళ్ళకి ఎలా సాయపడ్డాడు అనేది మిగిలిన కథాంశంగా స్పష్టమవుతుంది.

nanis-gang-leader-movie-trailer-review2

‘జెర్సీ’ లో మిస్ అయిన నాని మార్క్ కామెడీ ఈ చిత్రంలో పుష్కలంగా ఉండబోతుందని ట్రైలర్ చెబుతుంది. ‘ఆర్.ఎక్స్.100’ హీరో కార్తికేయ మంచి స్టైలిష్ విలన్ గా కనిపిస్తున్నాడు. ‘ఆకలేస్తే అక్షరాలు తింటాం… చలేస్తే పుస్తకాలు కప్పుకుంటాం’ అని రైటర్స్ ను ఉద్దేశిస్తూ నాని చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కచ్చితంగా ఆకట్టుకుంటుంది. ‘నేను ఇంకా థ్రిల్లర్ జోనర్ లోనే ఉన్నాను.. సైకో కిల్లర్ జోనర్ లోకి వెళ్ళే లోపు మొదలెట్టేద్దాం’ అని చివర్లో వచ్చే డైలాగ్ కూడా హైలెట్ అని చెప్పొచ్చు. ఏమైనా ట్రైలర్ అక్కట్టుకునే విధంగా ఉంది. మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

Share.