‘గద్దలకొండ గణేష్’ క్లోజింగ్ కలెక్షన్స్..!

’14 రీల్స్ ప్లస్’ బ్యానర్ పై అనిల్ ఆచంట, రామ్ ఆచంట నిర్మించిన తాజా చిత్రం ‘గద్దలకొండ గణేష్’. హరీష్ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మాస్ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 20 న విడుదలయ్యి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. తమిళంలో సూపర్ హిట్టైన ‘జిగర్తాండ’ చిత్రానికి ఇది రీమేక్ కావడం విశేషం. వరుణ్ తేజ్ మాస్ అవతార్ కు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు.

‘గద్దలకొండ గణేష్’ క్లోజింగ్… ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం 8.74 cr
సీడెడ్ 3.45 cr
ఉత్తరాంధ్ర 2.66 cr
ఈస్ట్ 1.61 cr
వెస్ట్ 1.51 cr
కృష్ణా 1.42 cr
గుంటూరు 1.83 cr
నెల్లూరు 0.89 cr
ఏపీ + తెలంగాణ 22.11 cr
రెస్ట్ అఫ్ ఇండియా 1.96 cr
ఓవర్సీస్ 1.08 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 25.15 cr (షేర్)

‘గద్దలకొండ గణేష్’ చిత్రానికి 25 కోట్ల వరకూ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక ఫుల్ రన్ పూర్తయ్యే సరికి ఈ చిత్రం 25.15 కోట్ల షేర్ ను రాబట్టింది. మొత్తానికి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించి హిట్ గా నిలిచింది. అయితే ఓపెనింగ్స్ ను చూసి ఈ చిత్రం కూడా ‘ఇస్మార్ట్ శంకర్’ రేంజ్ లో కలెక్ట్ చేస్తుంది అని అంతా అనుకున్నారు. కానీ ఆ స్థాయిలో మాత్రం కలెక్షన్లు రాబట్టలేకపోయిందనే చెప్పాలి..!

బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?
చిరంజీవి అతిధి పాత్ర చేసిన సినిమాలు?

Share.