గాలిసంపత్ ట్రైలర్: నువ్వేంటి నాన్నా..నన్ను తొక్కి ఎదగాలని చూస్తావ్..!

తెలుగు ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్ గా తనదైన ముద్ర వేసుకున్న అనిల్ రావిపూడి సమర్పణలో వస్తున్న సినిమా గాలిసంపత్. శ్రీవిష్ణు హీరోగా, రాజేంద్ర ప్రసాద్ హీరో తండ్రిగా అనిల్ కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కింది ఈ మూవీ. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ మూవీలో రాజేంద్ర ప్రసాద్ శ్రీవిష్ణు తండ్రి కొడుకులుగా కనిపిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఈ సినిమాకి డైలాగ్స్, స్క్రీన్ ప్లే మాత్రమే కాకుండా దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతలని కూడా అనిల్ రావిపూడి చేయడం విశేషం.

ఈసినిమా ప్రధానంగా తండ్రీ కొడుకుల మద్యన జరిగే హైడ్రామాగా ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతోంది. తండ్రికి యాక్టింగ్ అంటే పిచ్చి, కానీ నోట్లోనుంచి గాలి తప్ప సౌండ్ రాదు. ఈ క్యారెక్టర్ లో రాజేంద్రప్రసాద్ నవ్వులు పూయిస్తుంటే, ఒకపక్క తండ్రికి సపోర్ట్ చేస్తూనే, తండ్రి వల్ల వచ్చే సమస్యలని తట్టుకోలేని కొడుకుగా శ్రీవిష్ణు కనిపిస్తున్నాడు. ప్రతి ఒక్కరూ తన తండ్రిని ఎగతాళి చేస్తుంటే తట్టుకేలని కొడుకుగా, అలాగే తండ్రిని ఎమోషనల్ గా కసిరి తన ఆవేదని తీర్చుకునే యువకుడిగా శ్రీవిష్ణు కనిపిస్తున్నాడు.

ఏ తండ్రి అయినా కొడుకు ఎదగాలని చూస్తారు, కానీ నువ్వేంటి నాన్నా నన్ను తొక్కి నువ్వు ఎదగాలని చూస్తున్నావ్ అంటూ ట్రైలర్ లో చెప్పిన డైలాగ్స్ హైలెట్ గా నిలిచాయి. ఇక ట్రైలర్ చూస్తుంటే కామెడీతో పాటుగా, ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా సినిమాలో గట్టిగానే ఉన్నాయని అనిపిస్తోంది. అంతేకాదు, రాజేంద్రప్రసాద్ యాక్టింగ్ చాలా మిస్టీరియస్ కూడా కనిపిస్తోంది. అనిల్ రావిపూడి సమర్పణలో రాబోతున్న ఈ సినిమా మార్చి 19న విడుదల కాబోతోంది. మరి ఈ గాలిసంపత్ తెలుగు ప్రేక్షకులని ఎలా మెప్పిస్తాడు అనేది ఆసక్తికరం.


చెక్ సినిమా రివ్యూ & రేటింగ్!
అక్షర సినిమా రివ్యూ & రేటింగ్!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Share.