ఆ విషయంలో వరుణ్ కి హ్యాండిచ్చిన రానా, నితిన్

కొద్దిరోజులుగా మెగా హీరో వరుణ్ తేజ్ పెళ్లిపై వార్తలు వస్తున్నాయి. ఆయన తండ్రి నాగబాబు తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా నిహారిక మరియు వరుణ్ ల పెళ్లి వచ్చే ఏడాది ఉంటుంది అని చెప్పారు. దీనితో వరుణ్ పెళ్ళికి ఎంతో సమయం లేదని అందరూ భావించారు. ఐతే నేడు సోషల్ మీడియా వేదికగా ధరమ్ తేజ్ మరియు వరుణ్ ల మధ్య జరిగిన సంభాషణ వరుణ్ కి ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని తేల్చివేసింది.

గతంలో నాగబాబు చేసిన కామెంట్ ని ఉద్దేశిస్తూ ధరమ్…’ఏంటి బావా నీకు పెళ్ళంటగా?’ అని అడుగగా దానికి సమాధానంగా వరుణ్…’దానికి చాలా సమయం ఉందిలే కానీ, మన రానా, నితిన్ మాత్రం ఎప్పటికీ మీతోనే అంటూ సింపుల్ గా సింగిల్ గ్రూప్ నుండి వెళ్లిపోయారు’ అని ఫన్నీ సమాధానం చెప్పారు. వరుణ్ సెటైరికల్ గా స్పందించినా, అసలు విషయం మాత్రం చెప్పాడు. నాగబాబు చెవుతున్నట్లు వరుణ్ కి ఇప్పట్లో పెళ్లి చేసుకొనే ఆలోచన లేదు అనే విషయం ఈ ట్వీట్ ద్వారా స్పష్టం అయ్యింది. వరుణ్ తేజ్ వయసు ప్రస్తుతం 30ఏళ్ళు.

Funny conversation between Varun Tej, Nithin and Sai Dharam Tej1

ఆయన రానా, నితిన్ లను ఆదర్శంగా తీసుకుంటే మరో నాలుగైదేళ్ల వరకు పెళ్లి మాట ఎత్తకపోవచ్చు. ఈ మెగా హీరో పెళ్ళికంటే బ్యాచ్లర్ లైఫ్ కే మొగ్గుచూపుతున్నాడని అర్థం అవుతుంది. మెగా హీరోలలో అల్లు అర్జున్ మరియు చరణ్ చాల తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు. అల్లు అర్జున్ దాదాపు 29ఏళ్ళకు మ్యారేజ్ చేసుకున్నారు. ఆయన స్నేహ రెడ్డిని 2011లో వివాహం చేసుకోవడం జరిగింది. ఇక చరణ్ 27ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నారు. ఉపాసనతో ఆయన వివాహం 2012లో అయ్యింది.

Funny conversation between Varun Tej, Nithin and Sai Dharam Tej2

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Share.