చివరికి ఇలా సెట్ చేసుకున్నాడు.. ఇదైనా వర్కౌట్ అవ్వుద్దా?

తెలుగులో డిజాస్టర్ అయిన ‘ఆంధ్రావాలా’ సినిమాని కన్నడంలో తీసి సూపర్ హిట్ కొట్టాడనే ఉద్దేశంతో అనుకుంట… మెహర్ రమేష్ కు ‘కంత్రి’ చేసే ఛాన్స్ ఇచ్చాడు ఎన్టీఆర్. అనుకోకుండా ఆ చిత్రం కమర్షియల్ హిట్ అయ్యింది. సో మెహర్ అకౌంట్లో అది హిట్ అనే చెప్పాలి. దీంతో ప్రభాస్ తో ‘బిల్లా’ తెరకెక్కించే ఛాన్స్ వచ్చింది. ఇక ఆ చిత్రం యావరేజ్ అయ్యింది. అయినా మెహర్ రమేష్ టేకింగ్ సూపర్ అంటూ ప్రశంసలు దక్కాయి. రెండోసారి కూడా మనోడు సేఫ్ అయిపోయాడు కాబట్టి… ఎన్టీఆర్ మళ్ళీ ‘శక్తి’ చేసే అవకాశం ఇచ్చాడు. సినిమాకి భారీ బడ్జెట్ పెట్టించాడు. ఫలితం ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్. అసలు ఆ కథని ఎన్టీఆర్ ఎలా ఓకే చేశాడా అని ఆయన అభిమానులు ఇప్పటికీ ఆలోచిస్తూనే ఉన్నారు. ఇక మెహర్ పని అయిపొయింది అనుకుంటే.. ఈసారి వెంకటేష్ దొరికేసాడు. ‘షాడో’ సినిమాకి భారీ బడ్జెట్ పెట్టించి ఆ ప్రొడ్యూసర్ మళ్ళీ టాలీవుడ్లో కనబడకుండా చేసేసాడు.

mahesh-babu-namrata-meher-ramesh

ఇలాంటి డైరెక్టర్ తో మళ్ళీ సినిమా చేయడానికి ఏ హీరో అయినా సాహసిస్తాడా? ఎలాగూ మన మహేష్ బాబు కి మంచి స్నేహితుడు కాబట్టి.. బిజినెస్ విషయాలన్నీ ఈయనకి అప్పగించాడు. ఇలా తన జీవితాన్ని కొనసాగిస్తూనే.. ఇప్పుడు కొన్ని కథల్ని రెడీ చేసుకుని మహేష్ సతీమణి నమ్రత కు వినిపించాడట. ఈ కథల్ని వెబ్ సిరీస్ గా తెరకెక్కించాలని అనుకుంటున్నట్టు ఆమెకు చెప్పాడట. సరైన భాగస్వామి దొరికితే ఆ వెబ్ సిరీస్ నిర్మించడానికి సిద్ధంగా ఉన్నట్టు నమ్రత…. రమేష్ కు చెప్పిందట. మొత్తానికి ఇలా ఈ స్టార్ హీరో భార్యని బుట్టలో పడేసి మళ్ళీ డైరెక్టర్ ఛాన్స్ కొట్టేసాడు ఈ ప్లాప్ డైరెక్టర్. అయితే డైరెక్ట్ చేయబోయేది వెబ్ సిరీసే అయినా క్లిక్ అయితే మరిన్ని మంచి అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది అనడంలో సందేహం లేదు. మరి ఈ అవకాశాన్ని మెహర్ రమేష్ ఎంత వరకూ సద్వినియోగపరుచుకుంటాడో చూడాలి..!

Share.