అచ్చతెలుగు భామకి ఎట్టకేలకు మంచి ఆఫర్

పెరటి చెట్టి ఇంటి వైద్యానికి పనికిరాదు అనే నానుడి మన తెలుగు హీరోయిన్లు సరిగ్గా సరిపోతుంది. పాపం అందం, అభినయ సామర్ధ్యం, అందాన్ని బహిర్గతపరచగల సత్తా వంటి కమర్షియల్ హీరోయిన్ లక్షణాలు అన్నీ పుష్కలంగా ఉన్నప్పటికీ.. ఎక్కడో ముంబై నుంచి మినీ ఫ్రాక్స్ వేసుకొచ్చిన నార్త్ అమ్మాయిలకే ప్రాధాన్యత ఇస్తారు మన టాలీవుడ్ దర్శకనిర్మాతలు, హీరోలు. పోనీ పెద్ద సినిమాలకంటే శాటిలైట్ రైట్స్, హిందీ డబ్బింగ్ రైట్స్ లాంటివి ఉంటాయి కాబట్టి తప్పులేదు..

చిన్న సినిమాలకు కూడా తెలుగమ్మాయిలు పనికిరారా అనే డౌట్ అప్పుడప్పుడు జనాల మనస్సులో మెదులుతుంది కానీ.. వాళ్ళు కూడా ఆ ముంబై మేకప్ మొహాలకే అలవాటుపడిపోయారు. ఇలా టాలీవుడ్ సరిగా వినియోగించుకోలేకపోయిన మంచి తెలుగు నటి జాబితాలో ప్రధమంగా పేర్కొనవలసిన నటి రక్షిత అలియాస్ ఆనంది. అమ్మడు తెలుగులో పలు చిత్రాల్లో నటించినప్పటికీ.. ఆమెకు సరైన అవకాశం మాత్రం లభించలేదు. తమిళంలో మాత్రం చెప్పుకోదగ్గ చిత్రాలు బోలెడు చేసింది. అందుకే తమిళ చిత్రసీమ ఆమెను అక్కున చేర్చుకుంది.

అయితే.. ఇప్పుడిప్పుడే మళ్ళీ అమ్మడికి తెలుగులో అవకాశాలు పుంజుకుంటున్నాయి. “జాంబీ రెడ్డి” అనే చిత్రంలో ఆనంది కథానాయికగా నటిస్తుండగా.. ఇప్పుడు మరో తెలుగు చిత్రం “శ్రీదేవి సోడా సెంటర్” అనే టైటిల్ తో “పలాస” ఫేమ్ కరుణకుమార తెరకెక్కిస్తున్న తాజా చిత్రంలో హీరోయిన్ గా ఆనంది సెలక్ట్ అయ్యిందని తెలుస్తోంది. తెలుగమ్మాయికి ఇప్పటికైనా మంచి ఆఫర్లు వస్తున్నందుకు సంతోషిస్తూ.. ఆమెకు మరిన్ని ఆఫర్లు వచ్చి, స్టార్ హీరోయిన్లకు పోటీగా నిలవాలని కోరుకుందాం.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Share.