ఆ నాలుగు కుటుంబాలలో వారిదే ఆధిపత్యం..!

టాలీవుడ్ లో తిరుగులేని శక్తిగా మెగాస్టార్ చిరంజీవి కుటుంబం ఉంది. చిరంజీవి నెలకొల్పిన ఈ సామ్రాజ్యంలో పవన్ కళ్యాణ్ నుండి వైష్ణవ్ తేజ్ వరకు దాదాపు పది మంది హీరోలు అవతరించారు. వీరిలో పవన్, బన్నీ, చరణ్ స్టార్ హీరో హోదాలో పరిశ్రమను ఏలుతున్నారు. మెగాస్టార్ కుటుంబం కంటే ముందు నుండే తిరుగులేని శక్తులుగా ఉన్న నందమూరి, అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలకు కూడా పరిశ్రమపై ఇంత పట్టు మరియు ఆధిపత్యం లేదు. సినీ వారసత్వం పరంగా నటులుగా, హీరోలుగా, స్టార్ లుగా ఎదిగింది అతి తక్కువ మందే ఉన్నారు.

చిరంజీవి కుటుంబానికి ఇది ఎలా సాధ్యం అయ్యింది అనేది అసలు ప్రశ్న. లెజెండ్ ఎన్టీఆర్ కి ఎనిమిది మంది కుమారులు కాగా వారిలో నటులుగా మారింది ఇద్దరు మాత్రమే. వారిలో బాలకృష్ణ మాత్రమే స్టార్ హీరోలుగా ఎదిగారు. హరికృష్ణ కుమారులలో ఎన్టీఆర్ ఒక్కడే ఇప్పుడు ఆ లెగసీని కాపాడుతున్నారు. ఏ ఎన్ ఆర్ ఫ్యామిలీలో నాగార్జున తరువాత చైతు ఓ స్థాయి ఇమేజ్ తెచ్చుకున్నారు కానీ, స్టార్ హీరో కాలేకపోయారు. రామానాయుడి వారసులుగా ఉన్న సురేష్ స్టార్ ప్రొడ్యూసర్ గా ఉండగా, వెంకటేష్ స్టార్ హీరో హోదా అనుభవించారు.

Film industry running under the star hero families1

మూడవ తరం హీరోగా వచ్చిన రానా దగ్గుబాటికి పాన్ ఇండియా ఇమేజ్ ఉన్నప్పటికీ స్టార్ హీరో హోదా ఇంకా పొందలేదు. చిరంజీవి ఫ్యామిలీ అలా కాదు, వారి కుటుంబం నుండి వచ్చిన అందరూ హీరోలు ఓ స్థాయి ఇమేజ్ సొంతం చేసుకుంటున్నారు. అల్లు శిరీష్, కళ్యాణ్ దేవ్ వంటి వారు కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు. ఏది ఏమైనా మిగిలిన పెద్ద కుటుంబాలతో పోల్చుకుంటే చిరంజీవి ఫ్యామిలీ ముందంజలో ఉంది.

Most Recommended Video

టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!

Share.