లారెన్స్ ఘటనతో మరోమారు బయటపడిన నార్త్ ఇండస్ట్రీ హెచ్చులు

ఏదో ఇప్పుడు బాహుబలి రిలీజయ్యాక ఈ బాలీవుడ్ బ్యాచ్ అందరూ సౌత్ టెక్నీషియన్స్ కి వేల్యూ ఇవ్వడం మొదలెట్టారు కానీ.. ఇదివరకూ సౌత్ ఆడియన్స్ అన్నా, టెక్నీషియన్స్ అన్నా పెద్ద వెల్యూ ఇచ్చేవాళ్లు కాదు ఈ నార్త్ బ్యాచ్. ఇప్పుడు లారెన్స్ విషయంలో నార్త్ వాళ్ళు మన సౌత్ టెక్నీషియన్స్ కి ఎంత వెల్యూ ఇస్తారు అనేది మరోసారి రుజువైంది. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అని గొప్పగా చెప్పుకొనే ఒక దర్శకుడికి తెలియకుండా సెట్స్ లో మాత్రమే కాదు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఏదీ జరగదు. కానీ.. ఒక దర్శకుడికి తెలియకుండా ఒక సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం ఏమిటి అనేది చర్చనీయాంశంగా మారింది.

ఈ విషయమై దర్శకుడు లారెన్స్ చాలా బాధపడ్డాడు. ఆ కారణంగా సినిమా నుంచి కూడా తప్పుకొన్నాడు. ఈ విషయంలో తాను చాలా బాధపడ్డానని కూడా పబ్లిక్ స్టేట్ మెంట్ ఇచ్చాడు లారెన్స్. ఈ విషయమై రెండు రోజులు పూర్తవుతున్నా.. అక్షయ్ కుమార్ టీం నుంచి ఎవరూ రెస్పాండ్ అవ్వకపోవడం గమనార్హం. మరి ఇప్పటికైనా అక్షయ్ & టీం రెస్పాండ్ అయ్యి లారెన్స్ కి సారీ చెప్తారేమో చూడాలి.

Share.