ప్రభాస్ – యష్ మల్టీస్టారర్.. రావాల్సిందే!

ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఒక స్టిల్ ఇస్తేనే ఆ హడావుడి మామూలుగా ఉండదు. అభిమానుల్లో ఆనందం ఏ రేంజ్ లో ఉంటుందో సోషల్ మీడియాలో చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇక ప్రభాస్ – యష్ లాంటి పాన్ ఇండియా స్టార్స్ ఓకే తెరపై కనిపిస్తే ఆ కిక్కు ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇద్దరు స్టార్ హీరోలు పరభాషా అభిమానులను కోట్లల్లో సంపాదించుకున్నారు.

యష్ సినిమాకు సంబంధించిన అప్డేట్ వస్తే వస్తే ప్రభాస్ అభిమానులు సపోర్ట్ చేయడం అలాగే ప్రభాస్ సినిమాకు సంబంధించిన అప్డేట్ వస్తే యష్ ఫ్యాన్స్ మద్దతు పలకడం కామన్. ఇక హీరోలు కూడా అదే తరహాలో హెల్ప్ చేసుకుంటున్నారు. ఇటీవల యష్ ‘సలార్’ లాంచ్ ఈవెంట్ కు స్పెషల్ గెస్టుగా వచ్చిన విషయం తెలిసిందే. గతంలో ప్రభాస్ KGF 1 ప్రమోషన్ లో కూడా పాల్గొన్నారు.ఇక సలార్ లాంచ్ లో ప్రభాస్, యష్ ఓకే ఫ్రేమ్ లో కనిపించడంతో ఇరు వర్గాల అభిమానులు ఎంతగానో సంతోషించారు.

ఇంకా వారి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే దర్శకుడు ప్రశాంత్ నీల్ ను అభిమానులు ఓ విషయం గట్టిగా కోరుతున్నారు. ప్రభాస్, యష్ మల్టీస్టారర్ రావాల్సిందే అంటూ సోషల్ మీడియాలో అనేక రకాల హ్యాష్ ట్యాగ్స్ తో డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై దర్శకుడు ఎలాంటి క్లారిటీ ఇస్తాడో చూడాలి.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.