ట్రిబుల్ ఆర్ విషయంలో ఫ్యాన్స్ లొల్లి..!

బాహుబలి ప్రాజెక్ట్ తర్వాత యస్ యస్ రాజమౌళి చేస్తున్న ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ ట్రిబుల్ ఆర్. రణం రౌద్రం రుధిరం అంటూ తెలుగులో , అలాగే అన్ని భాషల్లో కూడా ఈ సినిమా విడుదలకి ముస్తాబయిపోతోంది. ఇక్కడి వరకూ కథ బాగానే ఉంది కానీ, ఫ్యాన్స్ విషయంలో మాత్రం ఇప్పట్నుంచే వార్ మొదలైంది. సిల్వర్ స్క్రీన్ పై మా హీరో పేరు ముందుగా వస్తుందంటే , మా హీరో పేరు ముందుగా వస్తుందంటూ ఫ్యాన్స్ లొల్లి షురూ చేశారు. అంతేకాదు, ఇప్పుడు సినిమాలో ఎవరి ఇంట్రడక్షన్ ముందుగా వస్తుంది అనేది కూడా చర్చనీయాంశం అయ్యింది.

ఇద్దరు తెలుగువీరుల పోరాటాన్ని తనదైన స్టైల్లో ఈసినిమాలో చూపించబోతున్నాడు జక్కన్న. అల్లూరి సీతారామారాజుగా రామ్ చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ఇద్దరూ సిల్వర్ స్క్రీన్ పైన తమ నటనావిన్యాసాన్ని చూపించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరిలో ఎవరు ముందుగా స్క్రీన్ పైన కనిపిస్తారు..? ఎవరి ఇంట్రడక్షన్ ముందుగా ఫ్యాన్స్ చూడబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. అంతేకాదు, టైటిల్స్ విషయంలో కూడా ఇద్దరి పేర్లు వాళ్ల ఇంట్రడక్షన్ పైనే వేస్తారు అనుకుంటే ఎవరిని ముందు చూపిస్తారు అనేది కూడా చర్చనీయాంశం అయ్యింది.

అందుకే, ఇప్పుడు రాజమౌళి వినూత్నంగా టైటిల్స్ వేయాలని చూస్తున్నాడట. ఇద్దరు హీరోలు ఇంట్రడక్షన్ లో పేర్లు వేయకుండా, స్టార్ కాస్టింగ్ సీతారామరాజు – రామ్ చరణ్, కొమరం భీమ్ – ఎన్టీఆర్ ఇలా ఇద్దరు పేర్లు ఒకేసారి స్క్రీన్ పైన చూపిస్తాడని అప్పుడు ఇద్దరి ఫ్యాన్స్ ని కూల్ చేసినట్లుగా ఉంటుందని కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా ఈసారి ఈ సినిమా రిలీజైనపుడు థియేటర్స్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్, మెగాఫ్యాన్స్ రచ్చ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. అదీ విషయం.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Share.