ప్రభాస్ ఫ్యాన్స్ ను నిరాశ పరిచిన ‘సాహో’ సాంగ్ ప్రోమో..!

‘సాహో’ ప్రమోషన్స్ మొదలయిపోయాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ యూట్యూబ్ లో దుమ్ము రేపుతోంది. సుజిత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆగష్టు 15 న విడుదల కాబోతుంది. దీంతో ప్రమోషన్స్ ను వేగవంతం చేయాలని చిత్ర యూనిట్ ‘యూవీ క్రియేషన్స్’ భావిస్తుంది. ఇందులో భాగంగా జూలై 8న ఈ చిత్రం నుండీ మొదటి పాట అయిన ‘సైకో సయాన్’ అనే సాంగ్ ను విడుదల చేయబోతున్నారు. ఈ పాటకు సంబందించిన టీజర్ ను ఈరోజు చిత్ర యూనిట్ విడుదల చేసింది. తెలుగు – హిందీ – తమిళ్ – మలయాళ భాషల్లో రిలీజ్ చేసిన ఈ సాంగ్ టీజర్ కొన్ని నిమిషాల్లోనే వైరల్ గా మారింది. బాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తనిష్క్ బాగ్జి ఈ పాట ని కంపోజ్ చేశాడు.

fans-disappointed-with-psycho-saiyaan-song-teaser1

ఈ సాంగ్ టీజర్ లో ప్రభాస్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. శ్రద్ధా కపూర్ కూడా చాలా హాట్ గా కనిపిస్తుంది. బాలీవుడ్ స్టైల్ లోనే ఈ పాట ఉంది. కాబట్టి ప్రభాస్ అభిమానులు కాస్త నిరాశచెందారనే చెప్పాలి. ఈ సాంగ్ టీజర్ 28 సెకండ్లు ఉంది. అయితే చాలా వరకూ టైటిల్స్ తోనే లాగించేసారు.

fans-disappointed-with-psycho-saiyaan-song-teaser2

ప్రభాస్ ను ఎక్కువగా చూపించలేదు. మ్యూజిక్ తో మొదలు.. అసలు లిరిక్ మొదలయ్యే సరికి ఈ టీజర్ ముగిసింది. ఈ పాట తెలుగు ఆడియన్స్ టేస్ట్ కు తగినట్టు అయితే లేదు. రెగ్యులర్ బాలీవుడ్ పాటలు వినేవాళ్ళకి మాత్రం నచ్చే అవకాశం ఉంది. అయితే మణిశర్మ స్టైల్ లో వినగా వినగా తెలుగు ప్రేక్షకులు కూడా ఓకే చెప్పేసే అవకాశం ఉందనుకోండి. ఈ టైటిల్స్ కాస్త తగ్గించి ప్రభాస్ ను కాస్త ఎక్కువ చూపిస్తే బాగుండేది అని ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

Share.