గాయాలపాలైన ప్రముఖ నటుడు!

ప్రముఖ మలయాళ నటుడు, హీరోయిన్ నజ్రియా నజీమ్ భర్త ఫాహద్ ఫాజిల్ షూటింగ్ లో గాయపడినట్లు తెలుస్తోంది. ఈ హీరో నటిస్తోన్న ‘మలయన్కుంజు’ అనే సినిమా షూటింగ్ కొచ్చిలో జరుగుతోంది. షూటింగ్ లో భాగంగా హీరో బిల్డింగ్ పై నుండి దూకే సన్నివేశం ఉంది. ఈ క్రమంలో హీరో బ్యాలెన్స్ తప్పడంతో బిల్డింగ్ పై నుండి కింద పడిపోయాడు. వెంటనే ఆయన్ని కొచ్చిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు.

ఈ ప్రమాదంలో ఆయన ముక్కుకి బలమైన గాయం కాగా.. శరీరానికి స్వల్ప గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని.. పూర్తి బెడ్ రెస్ట్ అవసరం చెప్పినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న వెంటనే నజ్రియా హాస్పిటల్ కి చేరుకున్నారు. ఫాహద్ ఫాజిల్ అభిమానులంతా తమ అభిమాన హీరో త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు. మలయాళంలో ఫాహద్ నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.

‘ట్రాన్స్’ సినిమాలో తన నటన కోట్లాది మందిని ఆకట్టుకుంది. ‘సూపర్ డీలక్స్’ సినిమాలో కూడా ఆయన కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం ఈ హీరో చేతుల్లో అరడజనుకి పైగా చిత్రాలున్నాయి.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Share.