సంక్రాంతికి ఫ్యామిలీ సినిమా దొరికేసిందోచ్!

ఈ సంక్రాంతి సమరం మరో రెండు రోజుల్లో మొదలుకానుంది. రోజురోజుకీ వాతావరణం వేడెక్కుతోంది. అందుకు తగ్గట్లే.. తమ చిత్రాల ప్రచారాలను కూడా పెంచుతున్నారు దర్శకనిర్మాతలు. అందుకే భాగంగానే ఇవాళ “ఎఫ్ 2” ట్రైలర్ ను విడుదల చేసింది చిత్రబృందం. ట్రైలర్ చూస్తుంటే.. వింటేజ్ వెంకీ ఈ బ్యాక్ అనిపిస్తుంది. పెళ్ళైన వ్యక్తిగా వెంకీ, ప్రేమలో పడిన కుర్రాడిగా వరుణ్ ఈ చిత్రంలో కనిపిస్తున్నారు.

Venkatesh, Varun Tej, Tamannaah, Mehreen Pirzada, Fun And Frustration Movie, F2 Movie, Dil Raju, Anil Ravipudi,

తమన్నా, మెహరీన్ అక్కాచెల్లెళ్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో వాళ్ళ గ్లామర్ డబుల్ డోస్ ఆడియన్స్ ను పూర్తిస్థాయిలో ఎంటర్ టైన్ చేయనుంది. ఇక ట్రైలర్ చూస్తుంటే.. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ జనవరి 12వ తారీఖున “ఎఫ్ 2” థియేటర్ల దగ్గర క్యూ కట్టేలా కనిపిస్తోంది. మాములుగానే ఆడాళ్ళ కారణంగా మగాళ్లు ఎదుర్కొనే సమస్యలు తెరపై చూడ్డానికి చాలా ఫన్నీగా ఉంటాయి.

Venkatesh, Varun Tej, Tamannaah, Mehreen Pirzada, Fun And Frustration Movie, F2 Movie, Dil Raju, Anil Ravipudi,

ఇక దానికి అనిల్ రావుపూడి టచ్ తగిలితే సినిమా ఏ స్థాయిలో ఉంటుంది అనేది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం. వెంకీ కామెడీ, వరుణ్ హీరోయిజం, హీరోయిన్ల గ్లామర్, అనిల్ రావిపూడి టేకింగ్ కలగలిసి “ఎఫ్ 2” చిత్రాన్ని సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లా నిలిపేలా ఉన్నాయి. మరి ఫైనల్ రిజల్ట్ ఏమిటనేది జనవరి 12న ఎలాగూ తెలిసిపోతుందనుకోండి.

Share.