చరణ్ పోస్టర్ తో ఆచార్య రేంజ్ ఛేంజ్ ..!

మెగాస్టార్ చిరంజీవి సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. ఇప్పుడు ఈ సినిమాని ప్యాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. మిగతా భాషల్లో డబ్బింగ్ వెర్షన్ విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్. దీనికి కారణం సినిమాపై వస్తున్న విపరీతమైన క్రేజ్ అని తెలుస్తోంది. రీసంట్ గా సిద్ధ అంటూ రామ్ చరణ్ ఎప్పుడైతే చిన్న పోస్టర్ తో ఎంట్రీ ఇచ్చాడో అప్పట్నుంచీ సినిమాకి క్రేజ్ పెరిగిపోయింది. సోషల్ మీడియాలో రామ్ చరణ్ ట్యాగ్ తో ఆచార్య ని తెగ సెర్చ్ చేసేస్తున్నరు నెటిజన్స్.

ఇందులో బాలీవుడ్ నుంచే రెస్పాన్స్ ఎక్కువగా వస్తోందని అందుకే దీన్ని హిందీలో కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నారట. ఇక మెగాఫ్యాన్స్ కి రామ్ చరణ్ కి ఉన్న రిలేషన్ గురించి సపరేట్ గా చెప్పక్కర్లేదు. రామ్ చరణ్ పోస్టర్ ఇలా రిలీజయ్యిందో లేదో అలా వైరల్ చేసేశారు. ఆచార్య సినిమాలో సిద్ధ క్యారెక్టర్ లో రామ్ చరణ్ చాలా సీన్స్ లో కనిపిస్తాడని అంటున్నారు. ఒకవైపు ట్రిబుల్ ఆర్ సినిమా చేస్తూనే ఈ సినిమాని ప్లాన్ చేసుకున్నాడు రామ్ చరణ్.

రామ్ చరణ్ ఆచార్య సినిమా సెట్ లోకి అడుగుపెట్టగానే సినిమా రేంజ్ పూర్తిగా మారిపోయిందని అంటున్నారు. అంతేకాదు, ఈ సినిమా భారీ రేటు కూడా పలికే అవకాశం కనిపిస్తోంది. లాస్ట్ టైమ్ సైరా సినిమాతో మెగాస్టార్ చిరంజీవి తన బాక్సీఫీస్ స్టామినాని చూపించాడు. ఇప్పుడు ఆచార్య తో కూడా అదే రేంజ్ సూపర్ సక్సెస్ ని అందుకోవాలని చూస్తున్నాడు. మరి ఈసారి తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి ఏ రేంజ్ లో సినిమాని మేక్ చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.