బిగ్ బాస్ 4: లాస్ట్ మూమెంట్స్ ఎంజాయ్ చేయమన్న శ్రీముఖి..!

బిగ్ బాస్ హౌస్ లో మాజీ టాప్ – 5 కంటెస్టెంట్స్ వచ్చి సందడి చేశారు. ప్రస్తుతం కోవిడ్ ఉన్న నేపథ్యంలో వర్చువల్ గా హౌస్ మేట్స్ ని పలకరిస్తూ సందడి చేశారు. ఈ సీజన్ లో చూసినట్లయితే ఒక్క గెస్ట్ కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వలేదు. ప్రతి సీజన్ లో ఏదో ఒక ఎపిసోడ్ లో వచ్చి సందడి చేసే విజయ్ దేవరకొండ సైతం కేవలం ట్వీట్స్ చేశాడే తప్ప హౌస్ లోకి రాలేదు. అయితే, సీజన్ 1 లో టాప్ 5 లో ఒకరైనా హరితేజ, సీజన్ 2 లో రన్నరప్ గా నిలిచిన గీతామాధురి , అలాగే సీజన్ 3 లో ఎంటర్ టైన్ చేసిన శ్రీముఖి, అలీరైజా కూడా హౌస్ మేట్స్ ని పలకరించారు. తమదైన స్టైల్లో ఎంటర్ టైన్ చేస్తూ రెచ్చిపోయారు.

ఇక హౌస్ మేట్స్ ని ఒక ఆట ఆడుకున్నారు. అరియానా, సోహైల్, అభిజీత్ లని పలకరిస్తూ వాళ్లు హౌస్ లో ఎలా ఉన్నారో, తాము ఎలా ఎంటర్ టైన్ అయ్యామో చెప్పారు. అన్ని సీజన్స్ కంటే కూడా ఇది చాలా బెస్ట్ సీజన్ అని చెప్పడంతో హౌస్ మేట్స్ లో ఉత్సాహం రెట్టింపు అయ్యింది.

ఇక బిగ్ బాస్ హౌస్ లో ఎవరు విన్నర్ అవుతారు అనేది మైండ్ లో నుంచీ తీసేసి హౌస్ ని ఎంజాయ్ చేయమని, మళ్లీ ఇలాంటి మూమెంట్స్ రావని, లాస్ట్ మూమెంట్స్ ని బాగా హ్యాపీగా హౌస్ లో ఫీల్ అవ్వమని చెప్పింది శ్రీముఖి. అంతేకాదు, బిగ్ బాస్ రూల్స్ ని సైతం బ్రేక్ చేసి బిగ్ బాస్ వాయిస్ ని పదే పదే వినమని, మళ్లీ మీపేరు బిగ్ బాస్ నోట ఎప్పుడు వింటారో తెలియదని చెప్పింది.

శ్రీముఖి చేసిన అల్లరి, అలీరైజ్ ఇన్ పుట్స్, గీతామాధురి పంచ్ లు, హరితేజ కౌంటర్స్ తో హౌస్ మేట్స్ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. వాళ్లు కూడా తమదైన స్టైల్లో స్పందించారు. అదీ విషయం.

Poll: బిగ్ బాస్ 4 విజేతగా మీరు ఎవరిని భావిస్తున్నారు?

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Share.