‘ఎవ్వరికీ చెప్పొద్దు’ ట్రైలర్ రివ్యూ

చిన్న సినిమాలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టి పెద్ద పెద్ద హిట్లు అందుకోవడంలో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎప్పుడూ ముందుంటాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కేవలం ప్రొడ్యూసర్ గానే కాకుండా డిస్ట్రిబ్యూటర్ గా కూడా చిన్న సినిమాల్ని ప్రేక్షకులకి అందిస్తుంటాడు. అలా ఇప్పుడు ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ అనే చిన్న సినిమాని రిలీజ్ చేయబోతున్నాడు. ఓ పక్కన ‘సైరా’ చిత్రం రికార్డులు కలెక్ట్ చేస్తూ దూసుకుపోతున్న సమయంలో అక్టోబర్ 8 న ఓ చిన్న సినిమాని దిల్ రాజు రిలీజ్ చేస్తున్నాడు అంటే… ఇప్పుడు అందరి ఫోకస్ ఆ సినిమా పై పడింది. ఇక ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్ కు మంచి స్పందన రావడంతో అది నిజమే అనిపిస్తుంది. ఇప్పుడు రిలీజ్ ట్రైలర్ ను కూడా విడుదల చేసి అంచనాలు మరింత పెంచేశారు.

evvarikee-cheppoddu-movie-release-date-fixed

‘బాహుబలి2’ ఫేమ్ రాకేష్ వర్రె ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఒక సీక్రెట్ చెప్పేసి అది ‘ఎవ్వరికీ చెప్పొద్దు’.. అంటే ఆ విషయం తెలుసుకున్న వ్యక్తలు మిగిలిన వారికి కూడా ఆ సీక్రెట్ చెప్పేసి.. దానిని ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ అంటారు. ఈ క్రమంలో జరిగే సంఘటనలు మంచి ఎంటర్టైన్మెంట్ ను అందిస్తాయని ట్రైలర్ చెప్పకనే చెప్పింది. బసవ శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై స్వయంగా హీరో రాకేషే నిర్మించాడు. చిన్న సినిమా అయినా కచ్చితంగా పెద్ద హిట్ కొట్టేలా ఉంది. ఇక ట్రైలర్ ను మీరు కూడా ఓ లుక్కెయ్యండి.

‘సైరా’ సినిమా రివ్యూ & రేటింగ్!
వార్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.