శేష్ ఖాతాలో మరో హిట్టు గ్యారంటీ

అడివి శేష్, రెజీనా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజాగా చిత్రం ‘ఎవరు’. వెంకట్ రాంజీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పీవీపీ బ్యానర్ పై ప్రసాద్.వి.పొట్లూరి నిర్మిస్తున్నాడు. నవీన్ చంద్ర, మురళీ శర్మ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. డిఫరెంట్ స్టోరీస్ తో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న అడివి శేష్ హీరో కావడంతో ఈ చిత్రం పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ కు మంచి స్పందన రావడంతో ఆ అంచనాలు మరింత బలపడ్డాయి. ఆగష్టు 15 న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ప్రమోషన్లలో భాగంగా ఈరోజు ట్రైలర్ ను విడుదల చేసారు.

evaru-movie-trailer-review1

ట్రైలర్ ఆరంభంలో రెజీనా పై ఎవరో అత్యాచారం చేస్తున్నారు… ఈ క్రమంలో ఆమె… ఆ వ్యక్తిని మర్డర్ చేసినట్టు స్పష్టమవుతుంది. ఈ కేసులో నుండీ తప్పించుకోవడానికి గౌతమ్ వాసుదేవ్(అడివి శేష్) అనే కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్ తో డీలింగ్ కుదుర్చుకోవడానికి రెజీనా ప్రయత్నిస్తుంది. ‘నాకు భయమేసింది…’ అని రెజీనా అంటుంటే.. ‘భయమేసినా ధైర్యంగానే చంపేశారుగా’ అని అడివి శేష్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ‘ఇన్విజిబుల్ గెస్ట్’ అనే హాలీవుడ్ చిత్రానికి ఇది అఫిషియల్ రీమేక్. సస్పెన్స్ థ్రిల్లర్ గా అదిరిపోయే విజువల్స్ తో ఈ చిత్రం ఉంటుంది. ఈ చిత్రాన్ని బాలీవుడ్లో ‘బద్లా’ పేరుతో రీమేక్ చేశారు. అయితే తెలుగు రీమేక్ కి మార్పులు గట్టిగానే చేసినట్టు ఈ ట్రైలర్ చెబుతుంది. శ్రీచరణ్ పాకాల అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ కే హైలెట్ అని చెప్పొచ్చు. మొత్తానికి ట్రైలర్ తో సినిమా పై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉందనడంలో సందేహం లేదు.

Share.