అడివి శేష్… మరో హిట్టు కొట్టేలా ఉన్నాడు

డిఫరెంట్ చిత్రాలు చేస్తూ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు అడివి శేష్. ‘దొంగాట’ ‘క్షణం’ ‘అమీ తుమీ’ ‘గూఢచారి’ వంటి వరుస సక్సెస్ ల తర్వాత శేష్ నుండీ వస్తున్న తాజా చిత్రం ‘ఎవరు’. వెంకట్ రాంజీ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ‘పీవీపీ’ బ్యానర్ ప్రసాద్.వి.పొట్లూరి నిర్మిస్తున్నాడు. రెజీనా హీరోయిన్ గా నటిస్తుండగా నవీన్ చంద్ర ఓ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. ఆగష్టు 15 న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబందించిన టీజర్ ను తాజాగా విడుదల చేశారు.

evaru-movie-teaser-review1

ఈ టీజర్లో పోలీస్ ఆఫీసర్ విక్రమ్ వాసుదేవ్ గా అడివిశేష్ కనిపిస్తున్నాడు. ఓ మర్డర్ మిస్టరీగా.. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కినట్టు తెలుస్తుంది. ‘రెజీనా ని ఎవరో రేప్ చేస్తున్న తరుణంలో ఆమె ఒక వ్యక్తిని చంపినట్టు.. ఆ తరువాత ఆమెని పోలీసులు విచారణ చేస్తున్నట్టు’ ఈ టీజర్లో చూపించారు. మురళీశర్మ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ‘స్పానిష్’ చిత్రమైన ‘ది ఇన్విసిబిల్ గెస్ట్’ పోలికలు ఈ టేజర్లో కనిపిస్తున్నాయి. ఆ చిత్రాన్ని.. ఇప్పటికే బాలీవుడ్లో ‘బద్లా’ పేరుతో రీమేక్ అయ్యింది. అమితాబ్ బచ్చన్, తాప్సి ప్రధాన పాత్రలు పోషించిన ‘బధ్లా’ చిత్రం హిందీలో పెద్ద హిట్టైంది.

Share.