శేష్ కి ఆగష్టు సెంటిమెంట్ కలిసొస్తుందా?

అడివి శేష్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఎవరు’. వెంకట్ రాంజీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘పీవీపీ సినిమా’ బ్యానర్ పై ప్రసాద్ వి పొట్లూరి నిర్మిస్తున్నాడు. ఆగష్టు 15 న ఈ చిత్రం విడుదల కాబోతుంది. గతేడాది ఆగష్టుకి ‘గూఢచారి’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్న అడివి శేష్ ఈసారి ‘ఎవరు’ చిత్రంతో అంతకు మించిన బ్లాక్ బస్టర్ కొడతాడని ప్రేక్షకులు గట్టి నమ్మకంతో ఉన్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టెలనే టీజర్, ట్రైలర్లు ఉండటం విశేషం. రెజీనా, నవీన్ చంద్ర కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి మంచి బిజినెస్ జరిగింది. ఏరియా వైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

adivi-seshs-evaru-movie-releasing-on-august-15th

నైజాం – 2.8 కోట్లు
వైజాగ్ – 0.95 కోట్లు
ఈస్ట్ – 0.60 కోట్లు

evaru-movie-teaser-review1
వెస్ట్ – 0.50 కోట్లు
కృష్ణా – 0.65 కోట్లు
గుంటూరు – 0.75 కోట్లు

2evaru
నెల్లూరు – 0.30 కోట్లు
సీడెడ్ – 1.15 కోట్లు
————————————————–
ఏపీ + తెలంగాణ – 7.7 కోట్లు

evaru-movie-trailer-review1

కర్ణాటక – 0.50 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – 0.15 కోట్లు
ఓవర్సీస్ – 1.65 కోట్లు
——————————————————————
వరల్డ్ వైడ్ టోటల్ – 10 కోట్లు
——————————————————————-

adivi-seshs-evaru-movie-releasing-on-august-15th

‘ఎవరు’ చిత్రానికి 10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే 10 కోట్ల పైనే షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఎలాగూ ఆగష్టు 15 న హాలిడే… లాంగ్ వీకెండ్ కలిసి రావడంతో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతేడాది విడుదలైన ‘గూఢచారి’ చిత్రం కూడా 10 కోట్ల షేర్ ను రాబట్టింది. సో శేష్ టార్గెట్ చాలా ఈజీ అని చెప్పొచ్చు.

Share.