బ్రేక్ ఈవెన్ దిశగా శేష్ ‘ఎవరు’ ..!

అడివి శేష్ హీరోగా వచ్చిన తాజా చిత్రం ‘ఎవరు’. వెంకట్ రాంజీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘పీవీపీ సినిమాస్’ బ్యానర్ పై ప్రసాద్ వి పొట్లూరి నిర్మించాడు. గతవారం విడుదలైన ఈ చిత్రం మొదటి షో తోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. గతేడాది ఆగష్టుకి ‘గూఢచారి’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్న అడివి శేష్.. ఈసారి ‘ఎవరు’ చిత్రంతో కూడా తన ట్యాలెంట్ ఏంటనేది మరోసారి చూపించాడు. టీజర్, ట్రైలర్లు చూసినప్పుడే ఈ చిత్రం హిట్టని ప్రేక్షకులు ఫిక్సయిపోయారు. రీమేక్ సినిమా అయినప్పటికీ… అందులో ఉన్న ఇంటెలిజెంట్ మార్పులకి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

adivi-seshs-evaru-movie-releasing-on-august-15th

ఇక ‘ఎవరు’ ఫస్ట్ వీక్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం – 2.96 కోట్లు
వైజాగ్ – 0.94 కోట్లు
ఈస్ట్ – 0.47 కోట్లు

evaru-movie-review4
వెస్ట్ – 0.29 కోట్లు
కృష్ణా – 0.54 కోట్లు
గుంటూరు – 0.45 కోట్లు

evaru-movie-review1
నెల్లూరు – 0.15 కోట్లు
సీడెడ్ – 0.74 కోట్లు
————————————————–
ఏపీ + తెలంగాణ – 6.54 కోట్లు

evaru-movie-review5
రెస్ట్ అఫ్ ఇండియా – 0.60 కోట్లు
ఓవర్సీస్ – 1.40 కోట్లు
—————————————————-
వరల్డ్ వైడ్ టోటల్ – 8.54 కోట్లు (షేర్)
—————————————————-

evaru-movie-review3

‘ఎవరు’ చిత్రానికి 10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొదటి వారానికే ఈ చిత్రం 8.54 కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే దాదాపు 85 శాతం రికవరీ అయిపోయినట్టే. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 1.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి సోమవారం కూడా ఈ చిత్రం డీసెంట్ కలెక్షన్లను రాబట్టింది. అయితే మంగళవారం నుండీ ఈ చిత్రం కలెక్షన్లు డ్రాపయ్యాయి. మరి ఈ శుక్రవారం నుండీ అయినా ఈ చిత్రం క్యాష్ చేసుకుంటుందేమో చూడాలి. పోటీగా మరే సినిమా లేదు కాబట్టి ‘ఎవరు’ కి కలిసొచ్చింది.

Share.