శేష్ కెరీర్లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన ‘ఎవరు’ ..!

అడివి శేష్ హీరోగా వచ్చిన తాజా చిత్రం ‘ఎవరు’. వెంకట్ రాంజీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘పీవీపీ సినిమాస్’ బ్యానర్ పై ప్రసాద్ వి పొట్లూరి నిర్మించాడు. ఆగష్టు 15న విడుదలైన ఈ చిత్రం మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. గతేడాది ఆగష్టుకి ‘గూఢచారి’ చిత్రంతో హిట్టందుకున్న శేష్.. ఈ ఆగష్టుకి ‘ఎవరు’ చిత్రంతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడని చెప్పాలి. ఇక తాజాగా ఈ చిత్రం క్లోజింగ్ కలెక్షన్ల వివరాలు బయటకి వచ్చాయి.

ఇక ‘ఎవరు’ చిత్రం ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం 3.74 cr
సీడెడ్ 0.93 cr
వైజాగ్ 1.11 cr
ఈస్ట్ 0.58 cr
వెస్ట్ 0.38 cr
కృష్ణా 0.66 cr
గుంటూరు 0.55 cr
నెల్లూరు 0.22 cr
ఏపీ + తెలంగాణ 8.17 cr
రెస్ట్ అఫ్ ఇండియా 0.81 cr
ఓవర్సీస్ 1.63 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 10.61 cr (షేర్)

ఎవరు‘ చిత్రానికి 10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం ఫైనల్ గా 10.61 కోట్ల షేర్ ను రాబట్టింది. మొత్తానికి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయ్యి శేష్ కు మరో హిట్ ను అందించింది. ‘ఎవరు’ చిత్రం.. ఇప్పటి వరకూ శేష్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ‘గూడచారి’ కలెక్షన్లను అధిగమించింది. దీంతో శేష్ మార్కెట్ మరింత పెరిగిందనే చెప్పాలి..!

గ్యాంగ్‌ లీడర్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
పహిల్వాన్ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Share.