‘యురేక’ మూవీ ట్రైలర్ రివ్యూ!

కార్తీక్ ఆనంద్, షాలిని వడ్ని కట్టి, మున్నా, డింపుల్ హయతి ప్రధాన పాత్రలు పోషించిన తాజా చిత్రం ‘యురేక’. ‘లక్ష్మీ ప్రసాద్ ప్రొడక్షన్’ బ్యానర్ పై ప్రశాంత్, లలిత కుమారి కలిసి నిర్మించారు. ‘బిగ్ బాస్3’ ఫేమ్ మహేష్ విట్టా కూడా కీలక పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని.. ఇందులో ఓ హీరోగా నటించిన కార్తీక్ ఆనందే డైరెక్ట్ చేసాడు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ సినిమా పై అంచనాల్ని పెంచింది. రాజమౌళి తెరకెక్కించిన ‘సై’ రేంజ్లో.. బీ టెక్ లో ఉండే బ్రాంచ్ ల స్టూడెంట్స్ మధ్య ఎటువంటి వివాదాలు చోటు చేసుకుంటాయి అనే థీమ్ తో ఈ చిత్రం తెరకెక్కినట్టు టీజర్ లో చూపించారు.

Eureka Movie Trailer Review1

అయితే ట్రైలర్ కు వచ్చేసరికి.. కొంచెం డెప్త్ కు వెళ్ళి ఓ ఆఫీస్ రూమ్ మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సినిమా సాగుతున్నట్టు స్పష్టమవుతుంది. నరేష్ కుమారన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ కు హైలెట్ అని చెప్పాలి. ఎన్.బి.విశ్వకాంత్ ఫోటోగ్రఫీ కూడా ఆకట్టుకునేలానే ఉంది. సస్పెన్స్ ఎలిమెంట్స్ తో… అలాగే యూత్ కు కనెక్ట్ అయ్యే ఎలెమెంట్స్ తో ట్రైలర్ ను బాగా కట్ చేశారు. ఈ ట్రైలర్ కచ్చితంగా సినిమా పై అంచనాల్ని పెంచేలానే ఉంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఓ లుక్కెయ్యండి.


‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!

Share.