కళ్యాణ్ రామ్ కు ఓ మంచి హిట్ అయ్యే లక్షణాలున్నాయి

మంచి వ్యక్తి, మంచి కొడుకు, మంచి అన్న, మంచి భర్త, మంచి తండ్రి, మంచి హీరో, అన్నిటికీ మించి మంచి నిర్మాత.. ఇన్ని మంచి లక్షణాలున్నాయి కాబట్టే.. ‘ఎంత మంచివాడవురా’ అనే టైటిల్ కళ్యాణ్ రామ్ కి పర్ఫెక్ట్ గా సరిపోయింది. ‘ఎమ్మెల్యే, 118’ వంటి హిట్ చిత్రాల అనంతరం కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఎంత మంచివాడవురా’. కళ్యాణ్ రామ్ సరసన మెహరీన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘శతమానం భవతి’ చిత్రంతో నేషనల్ అవార్డు అందుకున్న సతీష్ వేగేశ్న దర్శకుడు. ఇవాళ జె.ఆర్.సి కన్వెక్షన్ సెంటర్లో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేసారు. ప్రముఖ ఆడియో సంస్థ ఆదిత్య మ్యూజిక్ నిర్మాణ రంగంలోకి అడుగిడి నిర్మిస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం.

Entha Manchivaadavuraa Movie Trailer Review1

ఇక ట్రైలర్ లోకి వెళ్తే.. ఓ పల్లెటూరి నేపధ్యం, అందరూ తనవారే అనుకునే కథానాయకుడు, వాళ్ళు మాత్రమే కాదు వాళ్ళ కష్టాలు కూడా తనవిగా భావిస్తాడు.. వాటికి పరిష్కారం చూపుతాడు. ఈ క్రమంలో అతడు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు అనేది సినిమా కథాంశం అని అర్ధమవుతోంది. కళ్యాణ్ రామ్ మాస్ & క్లాస్ ఇమేజ్ కలయికగా కనిపిస్తుండగా.. మెహరీన్ ముద్దుగా మురిపించింది.. రాజీవ్ కనకాల కాస్త బొద్దుగా విలనిజం పండించాడు. సతీష్ వేగేశ్న తాను క్లాస్ సినిమాలు మాత్రమే కాదని.. మాస్ యాంగిల్స్ కూడా చక్కగా చూపించగలను అని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం ఫలించేట్లుగానే ఉంది. మరి ఈ సంక్రాంతికి ఈ మంచోడు సైలెంట్ గా హిట్ కొట్టేస్తాడేమో చూడాలి.


అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Share.