నాగ్ సినిమా వల్లే … వంశీ పైడిపల్లి కి దెబ్బ పడిందా?

వంశీ పైడిపల్లి డైరెక్షన్లో మహేష్ సినిమా ఉంటుందని గత కొన్నాళ్ళ నుండీ జోరుగా ప్రచారం జరుగుతుంది. ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రమోషన్స్ సమయంలో మహేష్ కూడా ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. వంశీ చెప్పిన గ్యాంగ్ స్టర్ లైన్ కు ఇంప్రెస్ అయిన మహేష్ … తన ఫ్యామిలీ టూర్ నుండీ వచ్చే లోపు ఫుల్ స్క్రిప్ట్ ను రెడీ చెయ్యమని చెప్పాడట. అయితే వంశీ రెడీ చేసిన స్క్రిప్ట్ మహేష్ ను ఆకట్టుకోలేదట. తన క్యారెక్టర్ ను సరిగ్గా డిజైన్ చెయ్యలేదని…కొంచెం టైం తీసుకుని అయినా పర్వాలేదు … మంచిగా రెడీ చేసుకుని రమ్మని మహేష్ … వంశీ కి చాలా సున్నితంగా చెప్పాడట. అయితే వంశీ స్క్రిప్ట్ సరిగ్గా రెడీ చేయకపోవడానికి నాగార్జున ‘వైల్డ్ డాగ్’ సినిమా కారణమని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.

Due To Nagarjuna vamsi paidipally mahesh babu movie stopped1

అసలు విషయం ఏమిటంటే… ‘వైల్డ్ డాగ్’ డైరెక్టర్ సోల్మాన్… వంశీ గత చిత్రాలైన ‘ఊపిరి’ ‘మహర్షి’ చిత్రాలకి రైటర్ గా పనిచేసాడు. ఆ చిత్రాల విజయాలు సాధించడం వెనుక సోల్మాన్ పనితనం ఉందని … ఇప్పుడు అతను డైరెక్టర్ గా మారి సినిమా చేస్తున్నాడు కాబట్టి… వంశీ సరిగ్గా కథ డెవలప్ చేయలేకపోతున్నట్టు తెలుస్తుంది. వంశీ పైడిపల్లి కెరీర్ ప్రారంభంలో కూడా కొరటాల శివ రైటర్ గా పనిచేసేవాడు. ‘ఎవడు’ సినిమా నుండీ సోల్మాన్ వచ్చి చేరాడని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.