7వ సారి రామ్ సినిమాకి సంగీతమందించబోతున్న దేవి శ్రీ ప్రసాద్..!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తమిళ దర్శకుడు లింగుస్వామి ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ద్విభాషా చిత్రంగా.. తెలుగు మరియు తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కనుంది ఈ చిత్రం. ‘శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్’ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నాడు.ఇప్పటికే హీరోయిన్ గా ‘ఉప్పేన’ బ్యూటీ కృతి శెట్టిని ఫైనల్ చేసారని టాక్ బలంగా వినిపిస్తుంది. ఇక ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ ఎంపికనట్టు తాజా సమాచారం.

ఇంత పెద్ద ప్రాజెక్ట్ కి.. దేవి శ్రీ ప్రసాద్ ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేసుకోవడం ఏంటి అని ప్రశ్నించేవారు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే గతేడాది దేవి కంటే తమన్ లీడింగ్ లోకి వెళ్ళిపోయాడు కాబట్టి..! అయితే రామ్ – దేవి కాంబినేషన్లో గతంలో వచ్చిన సినిమాలు దాదాపు అన్నీ మ్యూజికల్ హిట్సే..! ‘జగడం’ ‘రెడీ’ ‘శివమ్’ ‘నేను శైలజ’ ‘ఉన్నది ఒకటే జిందగీ’ ‘హలో గురు ప్రేమ కోసమే’ వంటి చిత్రాలు వీరి కాంబినేషన్లో వచ్చాయి.

వీటిలో ‘జగడం’, ‘శివమ్’ వంటి సినిమాలు ప్లాపైనా అవి మ్యూజికల్ హిట్సే..! ఇక రామ్- దేవి కాంబినేషన్లో రాబోతున్న 7వ చిత్రం ఇదని తెలుస్తుంది. నిజానికి ‘రెడ్’ చిత్రానికి దేవినే మొదట మ్యూజిక్ డైరెక్టర్ గా అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన మణిశర్మతో ఆ ప్రాజెక్టుని కంప్లీట్ చేశారు. ఇప్పుడు ‘ఉప్పెన’ తో మళ్ళీ దేవి ఫామ్లోకి వచ్చాడు కాబట్టి.. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి అతను ఛాన్స్ దక్కించుకున్నట్టు తెలుస్తుంది.

Most Recommended Video

చెక్ సినిమా రివ్యూ & రేటింగ్!
అక్షర సినిమా రివ్యూ & రేటింగ్!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Share.