దృశ్యం ట్రైలర్ లోనే లైన్ చేప్పేశారు..!

విక్టరీ వెంకటేష్ నటించిన దృశ్యం సినిమా ఎంతటి సక్సెస్ అయ్యిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన మోహన్ లాల్ సినిమా. తమిళంలో, తెలుగులో వేరే హీరోలు చేసినా సినిమా సూపర్ సక్సెస్ ని అందుకుంది. అందుకే ఈసినిమాకి సీక్వల్ చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ గా ఈ సినిమా ఉండబోతోంది. రీసంట్ గా రిలీజైన టీజర్ లో ఈ విషయాన్ని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మలయాళంలో రిలీజైన ఈ టీజర్ లో చాలా విషయాలు ఆసక్తిని రేపుతున్నాయి. ఈ ‘దృశ్యం 2’ సినిమా ఎలా ఉండబోతోంది అనేది కూడా టీజర్ లోనే హింట్స్ ఇచ్చారు.

దృశ్యం సినిమాలో చూసినట్లయితే జార్జ్ కుట్టి ( కథానాయకుడు ) తన తెలివితేటలు ఉపయోగించి హత్యానేరం నుంచి బయటపడతాడు. తన కుటుంబాన్ని రక్షించుకుంటాడు. తెలివిగా తారీఖులు మార్చి, ఒక దృశ్యాన్ని చూపిస్తాడు. తన భార్య, ఇద్దరు కూతుళ్లకి ఎలాంటి హాని కలగకుండా చూసుకుని పోలీస్ వ్యవస్థ మొత్తాన్ని తప్పుదోవ పట్టిస్తాడు. దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ఈ సినిమా సినీ ప్రేమికులని విపరీతంగా ఆకట్టుకుంది. అయితే, ఇప్పుడు ఏదైనా కథ సుఖాంతం అయ్యింది అనుకుంటున్నారో, అక్కడ్నుంచీ సెకండ్ పార్ట్ అంటే దృశ్యం 2 సినిమా ప్రారంభం కాబోతున్నట్లుగా టీజర్ చూస్తుంటే అర్ధమవుతోంది.

కుట్టి ఫ్యామిలీ రహస్యాన్ని దాచే ప్రయత్నం చేస్తారు. కానీ, సమయం గడిచేకొద్ది ఈ సీక్రెట్ దాగమన్నా దాగదు. బయటకి రావాల్సిందే అంటూ టీజర్ లో చూపించారు. కానీ, తన కుటుంబాన్ని కాపాడటానికి జార్జ్ కుట్టి ఎలాంటి ఆట ఆడాడు? కొత్త ఆటలోని ప్రమాదాల్ని ఎలా అధిగమించాడో తెరపై చూడాల్సిందే. అంటూ చాలా ఆసక్తిగా టీజర్ ని మలిచారు. మరి ఈ దృశ్యం 2 అమెజాన్ ప్రైమ్ లో విడుదలవుతోందని కూడా చెప్పడంతో ఇప్పుడు సినీ ప్రేమికులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదీ విషయం.


2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Share.