జనవరి – 26న మెగాఫ్యాన్స్ కి పండగే..!

జనవరి 26వ తేదిన మెగాఫ్యాన్స్ కి పండగే పండగ అంటున్నారు సినీజనం. ఇంతకీ మేటర్ ఏంటా అనుకుంటున్నారా.. జనవరి 26వ తేదిన గణతంత్ర్య దినోత్సవం సందర్భంగా ట్రిబుల్ ఆర్ సినిమా నుంచి ప్రత్యేకమైన టీజర్ రాబోతోందని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి సిల్వర్ స్క్రీన్ పై ఎలా ఉండబోతున్నారు అనేది టీజర్ లో చూపించబోతున్నట్లుగా టాక్. ఇప్పటి వరకూ ఇద్దరి క్యారెక్టర్స్ ని సపరేట్ గా రివీల్ చేసిన రాజమౌళి ఈ టీజర్ ని చాలా స్పెషల్ గా ఎడిటింగ్ చేస్తున్నట్లుగా సమాచారం.

ప్రస్తుతం ట్రిబుల్ ఆర్ మూవీ క్లైమాక్స్ సన్నివేశాలని చిత్రీకరస్తున్నామని, కొమరం భీమ్, ఇంకా అల్లూరి ఇద్దరూ కలిసి సాధించాలనుకున్నది నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారని మూవీటీమ్ ట్వీట్ చేసింది. దీంతో ఇప్పుడు ఈసినిమా ఎలా ఉండబోతోంది ? రాజమౌళి సిల్వర్ స్క్రీన్ పైన ఎలాంటి మాయ చేయబోతున్నాడని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఫ్యాన్స్ కి మరో గుడ్ న్యూస్ ఏంటంటే, ఇదే రోజున ఆచార్య టీజర్ కూడా రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాట.

Ram Charan in Acharya Movie Will be or not1

ట్రిబుల్ ఆర్ టీజర్ కంటే ముందే ఆచార్య టీజర్ రిలీజ్ చేయాలని కొరటాల అండ్ టీమ్ రెడీగా ఉన్నట్లుగా సమాచారం. మెగాఫ్యాన్స్ కి తండ్రి కొడుకులు ఇద్దరూ కలిసి డబుల్ ధమాకా ఇవ్వబోతున్నారన్నమాట. అయితే, ఆచార్య టీజర్ లో కూడా చరణ్ కనిపిస్తే ఫ్యాన్స్ కి పండగే పండగ అని చెప్పాలి. జనవరి 26న ఈ రెండు సినిమాల టీజర్లు ఎలా ఉండబోతున్నాయి. మెగాఫ్యాన్స్ యూట్యూబ్ ని ఎలా షేక్ చేయబోతున్నారు అనేది తెలియాలంటే మనం మరిన్ని రోజులు ఆగాల్సిందే. అదీ మేటర్.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.