9 ఏళ్ళ ‘దూకుడు’ మూవీ క్లోజింగ్ కలెక్షన్స్ లిస్ట్..!

‘పోకిరి’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టి సూపర్ స్టార్ గా ఎదిగిన మహేష్ బాబు.. ఆ తరువాత ‘సైనికుడు’ ‘అతిథి’ వంటి డిజాస్టర్ ఫలితాలను కూడా మూటకట్టుకున్నాడు. ఆ రెండు చిత్రాల ఫలితాలతో చాలా కన్ఫ్యూజ్ అయిపోయిన మహేష్ బాబు.. 3 ఏళ్ళ గ్యాప్ తీసుకుని త్రివిక్రమ్ డైరెక్షన్లో ‘ఖలేజా’ సినిమా చేసాడు. అయితే ఈ చిత్రం కూడా అంచనాలను అందుకోలేక డిజాస్టర్ అయ్యింది. ఈ నేపథ్యంలో.. ‘ ‘పోకిరి’ ఒక లాటరీ హిట్’, ‘మహేష్ బాబు పనైపోయింది’ అనే కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి.

17-dookudu

అయితే అటు తరువాత శ్రీనువైట్ల డైరెక్షన్లో వచ్చిన ‘దూకుడు’ చిత్రం ఆ కామెంట్స్ అన్నిటికి బ్రేక్ వెయ్యడమే కాకుండా.. మహేష్ బాబు బాక్సాఫీస్ స్టామినా ఏంటన్నది మరోసారి నిరూపించింది. ’14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్’ వారు నిర్మించిన ‘దూకుడు’ చిత్రం 2011 సెప్టెంబర్ 23న విడుదలైంది. ఓవర్సీస్ లో మొదటి 1 మిలియన్ డాలర్లను రాబట్టిన తెలుగు సినిమాగా ‘దూకుడు’ చిత్రం సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఈ చిత్రం ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 15 cr
సీడెడ్  7.5 cr
వైజాగ్ 4.4 cr
ఈస్ట్ 3.2 cr
వెస్ట్ 2.8 cr
కృష్ణా 3.0 cr
గుంటూరు 4.2 cr
నెల్లూరు 1.7 cr
ఏపీ (టోటల్) 41.8 cr
కర్ణాటక 4.2 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.1 cr
ఓవర్సీస్ 9.6 cr
వరల్డ్ వైడ్ టోటల్ 56.7 cr (Share)

 

‘దూకుడు’ చిత్రానికి 35కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక ఫుల్ రన్ ముగిసేసరికి 56.7 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే ఈ చిత్రం 101కోట్లను కొల్లగొట్టింది.

Most Recommended Video

‘బిగ్‌బాస్‌’ దివి గురించి మనకు తెలియని నిజాలు..!
తమకు ఇష్టమైన వాళ్ళకు కార్లను ప్రెజెంట్ చేసిన హీరోల లిస్ట్..!
ఇప్పటవరకూ ఎవ్వరూ చూడని బిగ్ బాస్ ‘అభిజీత్’ ఫోటో గ్యాలరీ!

Share.