కార్తీ మళ్ళీ బాక్సాఫీస్ ‘దొంగ’ గా మారతాడా..?

కొత్త కథల్ని, కొత్త దర్శకుల్ని ఎంచుకుని హిట్లివ్వడంలో కార్తీ ముందుంటాడు అనడంలో సందేహం లేదు. గత కొంతకాలంగా చెప్పుకోదగ్గ హిట్టు లేని కార్తీ.. ఇటీవల వచ్చిన ‘ఖైదీ’ చిత్రంతో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ను అందుకున్నాడు. ఈ చిత్రంతో మొదటిసారి 100కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టాడు. తెలుగులో కూడా ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇంకా ఈ చిత్రం రన్ అవుతూనే ఉండడం విశేషం. గతంలో ‘ఖైదీ’ చిత్రంతో మెగాస్టార్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశారో.. ఇప్పటి ‘ఖైదీ’ తో కార్తీ కూడా అదే సెన్సేషన్ క్రియేట్ చేసాడని చెప్పొచ్చు.

Karthi Next Film Titled as Donga

ఇదిలా ఉంటే.. ఈ హీరో మళ్ళీ మెగాస్టార్ టైటిల్ పై కన్నేశాడు. ఈసారి కూడా చిరంజీవి సూపర్ హిట్ చిత్రమైన ‘దొంగ’ అనే టైటిల్ ను తన తరువాతి సినిమాకి ఫిక్స్ చేసుకున్నాడు. మలయాళం ‘దృశ్యం’ ఫేమ్ జీతు జోసెఫ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో కార్తీ వదిన జ్యోతిక… కార్తీకి అక్కగా కనిపించబోతుండడం విశేషం. ఈ చిత్రంలో కార్తీ.. పేర్లు మార్చుకుని దొంగతనాలు చేసే వ్యక్తిగా కార్తీ కనిపిస్తున్నాడు. విడుదల చేసిన టీజర్ కు కూడా మంచి స్పందన లభిస్తుంది. మొదటగా ఈ చిత్రానికి ‘తమ్ముడు’ అనే పేరనుకున్నారు.. కానీ సెంటిమెంట్ పరంగా మళ్ళీ అన్నయ్య చిరంజీవి టైటిల్ ‘దొంగ’ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.


తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.