‘అన్నాత్తే’ షూటింగ్‌ డాక్టర్ల పర్యవేక్షణలో

కరోనా – లాక్‌డౌన్‌ తర్వాత రజనీకాంత్‌ ‘అన్నాతే’ షూటింగ్ మొదలైంది. అయితే కొద్ది రోజులకే తలైవాకి అనారోగ్యం చేయడంతో నిలిపేశారు. అయితే ఇటీవల సినిమా షూటింగ్‌ మళ్లీ మొదలైంది. రజనీకాంత్‌, ఇతర నటీనటులు యాక్టివ్‌గా సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అయితే షూటింగ్‌ జరుగుతున్నంతసేపు అక్కడ వైద్యులు ఉంటున్నారనేది కోలీవుడ్‌ టాక్‌. అసలు సెట్‌కి వైద్యులు ఎందుకొస్తున్నారు అంటే… రజనీకాంత్‌ కోసమే అనే సమాధానం వస్తోంది. రజనీకాంత్‌ అనారోగ్యం పాలవడంతో…

రాజకీయాలకు కూడా దూరమయ్యారు. అయితే ముందుగా ఒప్పుకున్న సినిమా అనో, లేక ఇంకే కారణంతోనో కానీ సినిమాలైతే చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చెన్నైలో జరుగుతోంది. వేసవిలో షూటింగ్‌ అవ్వడం, ఆరోగ్యం ఇటీవల కుదుటపడటం కారణంగా సెట్‌లో వైద్యులను పెట్టి మరీ చిత్రీకరణ నడిపిస్తున్నారట. ఏదైనా అవసరం వస్తే… వెంటనే అందుబాటులో ఉండేలా ఈ ఏర్పాటు అని తెలుస్తోంది. అయితే.. దీనిపై చిత్రబృందం నుండి ఎలాంటి అధికారిక సమాచారం లేదు.

‘అన్నాతే’ శివ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ప్రకాశ్‌రాజ్‌, సురేశ్‌, ఖుష్బూ సుందర్‌, మీనా, నయనతార, కీర్తి సురేశ్‌ ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇమ్మాన్‌ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల సినిమాలో జగపతిబాబు నటిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాను నవంబర్‌ 4న దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Share.