శర్వానంద్ వరుస ప్లాపుల్లో ఉన్నా.. అంత బడ్జెట్ పెడుతున్నారా?

‘ఆర్.ఎక్స్.100’ వంటి డబుల్ బ్లాక్ బస్టర్ ను అందించిన దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తోన్న మలి చిత్రం ‘మహా సముద్రం’. శర్వానంద్ మెయిన్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో సిద్దార్థ్ సెకండ్ హీరోగా నటిస్తున్నాడు. ఇక అదితి రావు హైదరి,అనూ ఇమాన్యుల్ వంటి క్రేజీ బ్యూటీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఆగష్టు 19న గ్రాండ్‌గా విడుదలకాబోతున్నట్టు ఇటీవల దర్శకనిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

7 ఏళ్ళ గ్యాప్ తరువాత తెలుగులో ‘మహా సముద్రం’ చిత్రంలో సిద్దార్ద్ నటిస్తుండడం విశేషం. ‘ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ బ్యానర్ పై అనిల్‌ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కూడా చైతన్‌ భరద్వాజే‌ సంగీతం అందిస్తుండడం విశేషం. ఇదిలా ఉండగా.. ఈ చిత్రానికి ఏకంగా 40కోట్ల బడ్జెట్ పెడుతున్నాడట నిర్మాత. శర్వానంద్ సినిమాకి అంత బడ్జెట్ అవసరమా అని కొంతమంది నిర్మాతను హెచ్చరిస్తున్నప్పటికీ.. కథ డిమాండ్ చెయ్యడం వల్లనే అంత పెద్ద మొత్తం పెడుతున్నట్టు అతను చెప్పుకొస్తున్నాడట.

శర్వానంద్ గత చిత్రాలు అయిన ‘పడి పడి లేచె మనసు’ ‘రణరంగం’ ‘జాను’ వంటి చిత్రాలు డిజాస్టర్లుగా మిగిలాయి. ఆ సినిమాలు కనీసం 10కోట్ల షేర్ ను కూడా రాబట్టలేకపోయాయి. ఇలాంటి టైములో శర్వానంద్ సినిమాకి అంత బడ్జెట్ పెట్టడం అంటే కాస్త రిస్క్ అయినప్పటికీ.. ‘శ్రీకారం’ చిత్రం కనుక హిట్ అయితే శర్వా మార్కెట్ మళ్ళీ పుంజుకునే అవకాశం పుష్కలంగా ఉంది.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Share.