దివ్య అగర్వాల్ ఫోటో పెద్ద చర్చకు దారి తీసిందిగా..!

ఈ మధ్య కాలంలో హీరోయిన్లకంటే, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు.. వాళ్ళకంటే కూడా బుల్లితెర పై కనిపించే నటీమణులే ఎక్కువ గ్లామర్ షో చేస్తున్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చెయ్యడం.. అవి కాస్త పెద్ద వైరల్ అవుతుండడం.. ఒకవేళ అవి శృతి మించి ఉంటే కనుక విమర్శల పాలవ్వడం వంటివి మనం చూస్తూనే వస్తున్నాం. సరిగ్గా ఇలాంటి సిట్యుయేషన్ నే ఫేస్ చేసింది దివ్య రావ్.

ఎంటివి.. ఏస్ ఆఫ్ స్పేస్ మొద‌టి సీజ‌న్ విజేతగా పాపులర్ అయిన దివ్య‌.. ప‌లు షోలు, మ్యూజిక్ ఆల్బ‌మ్‌ల‌లో న‌టించారు. 2019వ సంవత్సరంలో మోస్ట్ డిజైర‌బుల్ విమెన్ లిస్ట్‌లో ఆరో స్థానాన్ని కూడా కైవసం చేసుకుంది ఈ బ్యూటీ. అయితే మొన్నామధ్య ఈమె టాప్ లెస్ గా ఫొటోల‌కు పోజులివ్వడం పెద్ద దుమారాన్నే రేపింది. టాప్ లేకుండా పూల బొకేను ఆమె ప్యాంటు లోపలి పెట్టుకోవడం పై కొందరు విమర్శలు గుప్పించారు. ఈ విషయం పై దివ్య కూడా స్పందించింది.. “నేను 2020లో మొత్తం ఇంట్లోనే ఉండడం నన్ను చాలా డిజ‌ప్పాయింట్ చేసింది.

ఓ ప్రయోగం చెయ్యాలనిపించి ఆ ఫొటో షూట్‌కి పోజులిచ్చాను.నా శ‌రీరాన్ని చూపించాల‌న్న‌ది నా ముఖ్య ఉద్దేశం కాదు. కాన్సెప్ట్ నాకు బాగా న‌చ్చింది. చేయాలనిపించింది.! అంత‌కు మించి మరో ఉద్దేశం లేదు. కానీ జనాలు వేరేగా రిసీవ్ చేసుకుని నన్ను ట్రోల్ చెయ్యడం మొదలుపెట్టారు.. ఈ ట్రోల్స్ నాకు తలనొప్పిని తెచ్చిపెట్టాయి. అస‌లు నేను ఎంత బాధ‌ను అనుభ‌వించానో వాళ్లకు తెలియదు. నేను బిజీ ఆర్టిస్ట్ కాదని భావించి ఇలా దిగజారాను అలా దిగజారాను అంటున్నారు” అంటూ చెప్పుకొచ్చింది.

1

2

3

4

5

6

7

8

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Share.