‘డిస్కో రాజా’ టీజర్ రివ్యూ..!

మాస్ మాహా రాజ్ రవితేజ హీరోగా ‘ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై రామ్ తళ్ళూరి నిర్మిస్తున్న తాజా చిత్రం ‘డిస్కో రాజా’. ‘ఎక్కడికి పోతావ్ చిన్నవాడా’ ఫేమ్ వి.ఐ.ఆనంద్ ఈ చిత్రానికి దర్శకుడు. ‘రాజా ది గ్రేట్’ చిత్రం తర్వాత మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజ ఎంతో కసిగా ఈ చిత్రాన్ని చేసాడని చిత్ర యూనిట్ వర్గాల నుండీ సమాచారం. 2020 జనవరి 24న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు దర్శక నిర్మాతలు ప్రకటించారు. ఇక ఈ చిత్రం టీజర్ ను కూడా తాజాగా విడుదల చేశారు.

Disco Raja Movie Teaser Review1

ఐ యామ్ డన్ విత్ ఠిస్ ‘ఫ**గ్ క్రాప్’ అంటూ రవితేజ వాయిస్ ఓవర్ తో టీజర్ మొదలైంది. సైంటిఫిక్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కినట్టు టీజర్ స్పష్టంచేసింది. తాన్యా హోప్, వెన్నెల కిశోర్ వంటి వారు ఈ టీజర్ లో కనిపించారు. టీజర్ చివర్లో రవితేజ పై కొందరు గన్ లు పెట్టుకుని బెదిరిస్తుంటే.. వాళ్ళని మ్యాజిక్ చేసి ఆ గన్ లు వాళ్ళపైనే పెట్టుకునేలా చేస్తాడు.. అప్పుడు రవితేజ చేసే డ్యాన్స్ ఒక్కరికి గూజ్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఒకవిధంగా చాలా క్వాలిటీగా ఉందని చెప్పొచ్చు. ఇక టీజర్ ప్రారంభం నుండీ పూర్తయ్యే వరకూ తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదుర్స్ అనే చెప్పాలి. టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది మీరు కూడా ఓ లుక్కెయ్యండి.


అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Share.