డిస్కో రాజా టీజర్ 2.0 | రవితేజ

రవితేజ కథానాయకుడిగా వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “డిస్కో రాజా”. రవితేజ సరసన నభా నటేష్, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని ఎస్.ఆర్.టి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఈ చిత్రం నుండి విడుదలైన రెండు పాటలు, ఫ్రీకౌట్ టీజర్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుండి మరో టీజర్ ను విడుదల చేశారు. సినిమాలోని మరికొన్ని పాత్రలను రివీల్ చేయడంతోపాటు.. కథనాన్ని కూడా ప్రేక్షకులకు పరిచయం చేయడం కోసం విడుదల చేసిన ఈ రెండో టీజర్ కూడా మంచి రెస్పాన్స్ అందుకొంది.

Disco Raja Movie Teaser 2.0 Review1

ఒక మిషన్ కోసం బయలుదేరిన రవితేజ.. ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? వాటిని తనదైన యాటిట్యూడ్ తో ఎలా తీర్చుకున్నాడు? అనేదానికి కామిక్ యాంగిల్ ను యాడ్ చేసి స్టైలిష్ గా ప్రెజంట్ చేసాడు దర్శకుడు వి.ఐ.ఆనంద్. రవితేజ స్టైలిష్ గా.. మునుపటి ఎనర్జీ లెవెల్స్ తో ఆకట్టుకున్నాడు. జనవరి 24న రవితేజ పుట్టినరోజు కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.


సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Share.