రవితేజ మొదటి రోజు బాక్సాఫీస్ లెక్క..!

మాస్ మహా రాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం ‘డిస్కో రాజా’. నిఖిల్ కు ‘ఎక్కడికి పోతావ్ చిన్నవాడా’ వంటి బ్లాక్ బస్టర్ అందించిన వి.ఐ.ఆనంద్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘ఎస్.ఆర్.టి. ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మించాడు. ‘రాజా ది గ్రేట్’ చిత్రం తర్వాత 3 డిజాస్టర్ లు చవి చూసిన రవితేజ.. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని ‘డిస్కో రాజా’ చేసాడు. అయితే ఈరోజు (జనవరి 24న) విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. ‘స్కైఫై’ థ్రిల్లర్ ను రొటీన్ రివెంజ్ డ్రామాగా మార్చేసాడంటూ దర్శకుడు వి.ఐ.ఆనంద్ పై విమర్శలు వస్తున్నాయి. అయితే ఈ చిత్రం మరీ అంత తీసి పారేసేది కాదు. రవితేజ ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్, బాబీ సింహా విలనిజం, డిఫరెంట్ కాన్సెప్ట్ మరియు రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్, వెన్నెల కిశోర్ కామెడీ కోసం ఒకసారి చూడొచ్చు అని క్రిటిక్స్ చెబుతున్నారు.

Disco Raja Movie Review4

ఇక ఈ చిత్రానికి 22 కోట్ల వరకూ బిజినెస్ జరిగింది. ఇక మొదటి రోజు ఈ చిత్రం ఎంత వరకూ కలెక్ట్ చేస్తుంది అనే దాని పై డిస్కషన్లు జోరందుకున్నాయి. సంక్రాంతి సినిమాల జోరు ఇంకా తగ్గలేదు కాబట్టి… ‘డిస్కో రాజా’ చిత్రానికి కేవలం 400 థియేటర్స్ మాత్రమే దక్కాయి. దీంతో భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం లేదు. ఇక టాక్ కూడా మిక్స్డ్ గా ఉంది కాబట్టి అదో డిజడ్వాంటేజ్ అని చెప్పాలి. ఏమైనప్పటికి ఇప్పటి వరకూ ట్రేడ్ నుండీ అందుతున్న సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో 2.5 కోట్ల షేర్ నుండీ 3.5 కోట్ల షేర్ మధ్యలో.. ‘డిస్కో రాజా’ మొదటి రోజు వసూళ్లు ఉండొచ్చు అని తెలుస్తుంది.

Click Here to Read Discoraja Movie Review

డిస్కో రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Share.