అందుకే నేను స్టార్ హీరోల జోలికి పోను : డైరెక్టర్ తేజ

విలక్షణ దర్శకుడు తేజ మాట్లాడే తీరు కాస్త విభిన్నంగా ఉన్నా… ఆసక్తికరంగా ఉంటుంది. కెరీర్ ప్రారంభం నుండీ ఆయన ఎక్కువగా కొత్తవాళ్ళతోనే సినిమాలు చేస్తూ వచ్చారు. ఆ తర్వాత చిన్న హీరోలతో తీశారు. పెద్ద హీరోలతో మాత్రం తీసేవారు కాదు. మహేష్ బాబు లాంటి స్టార్ హీరోని డైరెక్ట్ చేసినా.. అప్పటికి మహేష్ స్టార్ హీరో కాదు. ఇక కళ్యాణ్ రామ్ కూడా చిన్న హీరోనే..! అసలు తేజ స్టార్ హీరోలతో చేయడానికి… ఎందుకు ఇంట్రెస్ట్ చూపించరు?…. అనే ప్రశ్నకు తాజాగా స్పందించారు తేజ.

director-teja-shocking-comments-on-star-heros1

తేజ మాట్లాడుతూ… “స్టార్ హీరోలతో సినిమాలు చేయాలంటే నాకు భయం. వాళ్ళతో సినిమాలు చేస్తే, అలా కాదు ఇలా చేయమని చెబితే.. వాళ్ళు వింటారో లేదో అనే డౌటు నాది. ముంబైలో అయితే వింటారు .. తెలుగు వాళ్ళు వింటారా అనే భయం ఉండేది. డైలాగ్ సరిగ్గా చెప్పకపోతే స్టార్ హీరోలకి మళ్ళీ మళ్ళీ చెప్పలేం. అలా డైలాగ్ సరిగ్గా చెప్పకపోతే సీన్ చెడిపోతుంది. సీన్ చెడిపోతే సినిమా పోతుంది. సినిమాపోతే నాకు మళ్ళీ అవకాశాలు రావు. స్టార్ హీరోలతో చేస్తే అదే పెద్ద తలనొప్పి. అందుకే చిన్నవాళ్ళతో చిన్న సినిమాలు చేసుకుంటూ వెళుతుంటాను” అంటూ చెప్పుకొచ్చాడు.

Share.