క్రేజీ కాంబో కాన్సెప్ట్ అదిరింది గురూ..!

పుష్ప సినిమాతో బిజీగా ఉన్న సుకుమార్ తన తర్వాత ప్రాజెక్ట్ ని రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో చేస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ పై సినిమా అనగానే సుకుమార్ ఎలాంటి లవ్ స్టోరీ చేయబోతున్నాడో అనుకున్నారు అందరూ. అయితే, ఇది ఇండియా వర్సెస్ పాకిస్థాన్ కథగా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినపుడు ఉన్న పరిస్థితులు, అప్పుట్లో ఇండియా , పాకిస్థాన్ విడిపోయేటపుడు జరిగిన సంఘటనల ఆధారంగా సినిమా ఉండబోతోందని చెప్తున్నారు.

ఇది పీరియాడికల్ సినిమాగా ఉంటుందని,ఇందులో ఇండియా పాకిస్థాన్ వార్ ని కూడా చూపించబోతున్నారని, జవాన్ గా విజయ్ దేవరకొండ కనిపిస్తాడని టాక్. అయితే, ఇందులో ఎంతవరకూ నిజం ఉంది అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది..ప్రస్తుతం విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు, అలాగే సుకుమార్ కూడా పుష్ప సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.ఈ రెండు సినిమాలు పూర్తి అయిన తర్వాతే ఈ సినిమా ఉంటుందని చెప్తున్నారు.

దాదాపు 150కోట్లకి పైగా బడ్జెట్ ని ఈ సినిమాకి కేటాయించినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో ఒక కొత్త హీరోయిన్ ని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారట. మరి ఈ క్రేజీ కాంబినేషన్ కి తగ్గట్లుగానే క్రేజీ హీరోయిన్ దొరికితే సూపర్ హిట్ కొట్టడం కన్ఫార్మ్ గానే కనిపిస్తోంది.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Share.