‘కోతి కొమ్మచ్చి’కి మ్యూజిక్ డైరెక్టర్ అతడే!

దర్శకుడిగా వేగేశ్న సతీష్‌కి పేరు తీసుకొచ్చిన సినిమా ‘శతమానం భవతి’. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఆ సినిమా విజయంలో మ్యూజిక్ కూడా కీలక పాత్ర పోషించింది. ఆ సినిమాకి మిక్కీ జె. మేయర్ మ్యూజిక్ అందించారు. దాని తరవాత వేగేశ్న సతీష్ తీసిన ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాకీ మిక్కీ మ్యూజిక్ అందించారు. ఆ తరవాత సినిమా ‘ఎంత మంచివాడవురా’కి మ్యూజిక్ డైరెక్టర్‌ని ఛేంజ్ చేశారు. మిక్కీ జె. మేయర్‌ని కాకుండా గోపీసుందర్‌ని తీసుకున్నారు వేగేశ్న సతీష్. ఇప్పుడు డైరెక్ట్ చెయ్యబోతున్న కొత్త సినిమాకి మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్‌ని ఛేంజ్ చేశారు.

లేట్ యాక్టర్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ హీరోగా వేగేశ్న సతీష్ డైరెక్ట్ చెయ్యనున్న సినిమా ‘కోతి కొమ్మచ్చి’. ఈ సినిమాతో కుమారుడిని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు డైరెక్టర్. ఇందులో వేగేశ్న సతీష్ కుమారుడు సమీర్ వేగేశ్న మరో హీరో. దీనికి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ డైరెక్టర్. స్టోరీ విన్న వెంటనే అతడు సినిమా యాక్సెప్ట్ చేశాడట. కన్‌ఫ్యూజన్ కామెడీతో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాకి అనూప్ పెప్పీ ఆల్బమ్ రెడీ చేశాడట. ఆల్రెడీ మూడు ట్యూన్లు ఫైనలైజ్ చేశారని సమాచారం.

Director Satish Vegesna

‘శతమానం భవతి’ నుండి ఫ్యామిలీ జానర్ సినిమాలు తీసిన వేగేశ్న సతీష్, ‘కోతి కొమ్మచ్చి’తో మరోసారి కామెడీ బాటపట్టారు. ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉండేలా చేసుకున్నారట. ప్రేక్షకులను ఈ సినిమా ఆద్యంతం నవ్విస్తుందట. విశాఖపట్టణం, అమలాపురం నేపథ్యంలో కథ నడుస్తుందని తెలిసింది. దసరాకి సినిమాకి పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించి, నవంబర్ లో షూటింగ్ స్టార్ట్ చెయ్యాలనుకుంటున్నారు. దీనికి ఎం.ఎల్.వి. సత్యనారాయణ ప్రొడ్యూసర్.

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Share.