డార్లింగ్ ఫ్యాన్స్‌కు జ‌క్క‌న్న‌ పెద్ద ఝ‌లక్ ఇచ్చాడే..!

తెలుగు సినిమా ఖ్య‌తిని ఖండాత‌రాలు దాటించిన ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి. జ‌క్క‌న్న‌గా త‌ను చెక్కిన చిత్రాల‌న్నీ భారీగా విజ‌యాలు సాధించాయి. ఇక రాజ‌మౌళి, ప్ర‌భాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన చిత్రాలు ఏ రేంజ్‌లో సంచ‌ల‌నం సృష్టించాయో అంద‌రికీ తెలిసిందే. ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన తొలి చిత్రం ఛత్రపతి. 15 సంవ‌త్స‌రాల క్రితం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఆ చిత్రం అప్ప‌ట్లో ఎంత పెద్ద హిట్ అయ్యిందో అంద‌రికీ తెలిసిందే. ఇక ఆ త‌ర్వాత ఇద్ద‌రి నుండి వ‌చ్చిన బాహుబలి 1, బాహుబలి2 చిత్రాలు చరిత్ర‌లో నిలిచిపోయేలా బాక్సాఫీస్ వ‌ద్ద‌ ప్ర‌భంజ‌నం సృష్టించాయి.

దీంతో ద‌ర్శ‌కుడిగా రాజ‌మౌళిని ఎవ‌రూ అందుకోలేనంత స్థాయికి చేరుకున్నాడు. మ‌రోవైపు ప్ర‌భాస్ అయితే ఏకంగా పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. జ‌క్క‌న్న బాహుబ‌లిలో ప్ర‌భాస్‌ను ఓ రేంజ్‌లో ఎలివేట్ చేయ‌డంతో, ఇక‌ముందు చేస్తే పాన్‌ ఇండియా సినిమాలే చేయాలి అనేలా ప్రభాస్‌ స్టార్‌ డమ్‌ మారిపోయింది. దీంతో ఇద్ద‌రి కాంబోలో మ‌రో సినిమా కోసం ప్రేక్ష‌కులు ఎదురు చూస్తున్నారు. ప్ర‌భాస్‌కి రాజ‌మౌళి అంటే ఎంతో గౌర‌వం, జ‌క్క‌న్న‌కి డార్లింగ్ అంటే ఎంతో ఇష్టం.. దీంతో వీరి నుండి మ‌రో సినిమా వ‌స్తే మ‌రోసారి అద్భుతాలు క్రియేట్ చేస్తుంద‌ని ప్ర‌భాస్ ఫ్యాన్స్‌తో పాటు కామ‌న్ ఆడియ‌న్స్ సైతం అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీలో ప్ర‌భాస్ గెస్ట్ రోల్ చేయ‌నున్నాడనే వార్త‌లు సోష‌ల్ మీడియాలో జోరుగా చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

Only Prabhas can do that for Rajamouli1

అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో భాగంగా రాజ‌మౌళి.. ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కు ఒక్క నిముషం హార్ట్ బ్రేక్ చేసినా ఫుల్లుగా క్లారిటీ ఇచ్చాడు. ప్ర‌భాస్‌తో మ‌ళ్ళీ సినిమా ఎప్పుడ‌ని ప్ర‌శ్నించ‌గా.. వామ్మో మళ్లీ ప్రభాస్‌తో సినిమానా నావ‌ల్ల కాదు, ఇప్ప‌టికే బాహుబ‌లి రెండు పార్టుల కోసం దాదాపు ఐదు సంవ‌త్స‌రాలు క‌లిసి కాపురం చేశామ‌ని, మ‌ళ్ళీ మా ఇద్ద‌రి కాంబినేష‌న్ అంటే వీళ్ళు మ‌ళ్ళీ మొద‌లు పెట్ట‌బోతున్నారోయ్ అంటూ జ‌నాలు త‌ల‌లు ప‌ట్టుకుంటార‌ని చెప్పి షాక్ అచ్చాడు.

Prabhas vs Rajamouli1

అక్క‌డ చిన్న గ్యాప్ ఇచ్చిన జ‌క్క‌న్న స‌ర‌దాగా అన్నాన‌ని ప్రభాస్‌తో సినిమా చేయడం త‌న‌కు ఎప్పుడూ ఇష్ట‌మే అని, మంచి కథ సెట్ అయితే ఇద్ద‌రం క‌లిసి తప్పకుండా చేస్తామ‌ని తేల్చి చెప్పాడు. ఈ సెన్షేష‌న‌ల్ కాంబో ఇప్ప‌ట్లో అయితే కుద‌ర‌దు గానీ 2025 వ‌ర‌కు మాత్రం కుదిరే చాన్స్ లేదు. ఇక ప్ర‌స్తుతం టాలీవుడ్ క్రేజీ మ‌ల్టీ స్టార‌ర్ ఆర్ ఆర్ ఆర్ సినిమాని జ‌క్క‌న్న‌ చెక్కుతుండ‌గా, మ‌రోవైపు ప్ర‌భాస్ హీరోగా తెర‌కెక్కుతున్న‌ రాధే శ్యామ్ షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?</stron

Share.