స‌ర్కారువారి ఇంట‌ర్వెల్.. థియేట‌ర్ దద్ధరిల్లిపోతుంద‌ట‌..!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం స‌ర్కారువారి పాట. ఈ ఇద్దిర కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న మొద‌టి చిత్రం స‌ర్కారువారి పాటు. ఇటీవ‌ల పూజా కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. ఇక ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ , 14 రీల్స్, జీ ఎమ్ బీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండ‌గా, కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తుంది.

బ్యాంకింగ్ సెక్టార్స్‌లో జ‌రిగే ఆర్ధిక నేరాల నేప‌ధ్యంలో ఈసినిమా తెర‌కెక్కుతుంద‌ని స‌మ‌చారం. గీత గోవిందం లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత ప‌ర‌సురాం తెర‌కెక్కిస్తున్న‌ చిత్రం కావ‌డం, మ‌రోవైపు స‌రిలేరు నీకెవ్వ‌రు లాంటి హిట్ త‌ర్వాత మ‌హేష్ న‌టిస్తున్న సినిమా కావ‌డంతో ఈ చిత్రం పై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. అందుకు త‌గ్గ‌ట్టే ప‌ర‌శురాం స్క్రిప్ట్‌ను ప‌ర్‌ఫెక్ట్‌గా సిద్ధం చేసుకున్నాడ‌ని, మంచి క‌థ‌తో పాటు స్కీన్ ప్లే అద్భుతంగా ఉంటుంద‌ని టాక్.

ఇక అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళితే మ‌హేష్ నుండి వ‌స్తున్న సినిమాల్లో క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో పాటు కొత్త మెసేజ్ ఉంటుంది. భ‌ర‌త్ అనే నేను, మ‌హ‌ర్షి, స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రాలు అలా వ‌చ్చే బాక్సాఫీస్ వ‌ద్ద స‌త్తా చాటాయి. దీంతో స‌ర్కారువారి పాటు సినిమా కూడా అదే కోవ‌లో ఉంటుద‌ని తెలుస్తోంది. త‌న‌కు ఎలాంటి క‌థ కావాలో, అందులో ఎలాంటి ఎలిమెంట్స్ ఉండాలో మ‌హేష్ ముందుగానే చెప్ప‌డంతో, అందుకు త‌గ్గ‌ట్టు ప‌ర‌శురాం స్కిప్ట్‌ను డిజైన్ చేసినట్లు స‌మాచారం.

అంతే కాకుండా ఏ సినిమాకైన ఇంటెర్వెల్ ఆయువుప‌ట్టులాంటింది. ఇంట‌ర్వెల్‌బ్యాంగ్ స‌రిగ్గా కుదిరితే సినిమా రిజ‌ల్ట్ ఓ రేంజ్‌లో ఉంటుంద‌ని మేక‌ర్స్ న‌మ్ముతారు. దీంతో ప‌ర‌శురాం అండ్ టీమ్ ఎంతో శ్ర‌మించి ఇంటర్వెల్ సీన్స్ డిజైన్ చేశార‌ట‌. మ‌హేష్ కెరీర్‌లోనే ది బెస్ట్ ఇట‌ర్వెల్‌గా నిలిచిన ఒక్క‌డుకు మించి స‌ర్కారువారి పాటు ఇంట‌ర్వెల్ బ్యాంగ్ అదిరిపోయేలా ఉంటుంద‌ని, థియేట‌ర్‌లో విజిల్స్‌తో మోత మోగిపోతుంద‌ని అంటున్నారు. అంతే కాకుండా క్లైమాక్స్‌లో వ‌చ్చే స‌న్నివేశాలు కూడా ఓ రేంజ్‌లో డిజైన్ చేశార‌ట‌. మ‌రి స‌ర్కారువారి పాటు రిజ‌ల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Share.