ఆసక్తిరేపుతున్న డైరెక్టర్ ట్రైలర్..!

నాటకం సినిమా ఫేమ్ ఆశిష్ గాంధీ హీరోగా తెరకెక్కుతున్న సినిమా డైరెక్టర్. తిరుపతి రెడ్డి ప్రొడ్యూసర్ గా ఇద్దరు యంగ్ డైరెక్టర్స్ కిరణ్ ఇంకా కార్తీక్ కృష్ణ దర్శకత్వంలో తీసిన ఈ సినిమా ట్రైలర్ ని రామానాయుడు స్టూడియోలో వైభవంగా లాంఛ్ చేసింది చిత్రయూనిట్. ట్రైలర్ చూస్తుంటే కాన్సెప్ట్ కొత్తగా ఉందే అనిపించేలాగానే ఉంది. జనరల్ గా మీరు ఎలాంటి సినిమాలు తీస్కుంటారు అంటూ హీరో ముందుగానే ఈసినిమా కొత్తగా ఉంటుందని చెప్పకనే చెప్తున్నాడు. ఇక ట్రైలర్ లో లాస్ట్ లో పేల్చిన పంచ్ డైలాగ్ హైలెట్ అనే చెప్పాలి.

ఇంతకు ముందే ఈ సినిమా నుంచి వచ్చిన రెండు పాటలు యూట్యూబ్ లో సినీ లవర్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. నాటకం సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ఆశిష్ గాంధీ ఈ సినిమాలో రఫ్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఒకవైపు లవర్ బాయ్ లాగా కనిపిస్తూనే మరోవైపు ఫుల్ మాస్ లుక్ లో ఉన్నాడు. ట్రైలర్ లో ఒక షాట్ లో కన్నడ రాకింగ్ స్టార్ యష్ ని తలపించాడు అంటే అతిశయోక్తి కాదేమో. అంతలా తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సినీ లవర్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో సినిమాలు ఎప్పుడు విజయం సాధిస్తాయని, అందుకే విజన్ సినిమాస్ ద్వారా ఫస్ట్ ప్రాజెక్ట్ ని ఈ సినిమాతో లాంఛ్ చేశామని ప్రొడ్యూసర్ తిరుపతి రెడ్డి అన్నారు. కో ప్రొడ్యూసర్ తిరుమల్ రెడ్డి మాట్లాడుతూ ఈ సినిమా నెక్ట్స్ లెవల్ సినిమాగా ఉంటుందని, థియేటర్స్ లో కుర్చున్న వాళ్లు పక్కనే వచ్చి ఎవరైనా పొడిచినా కూడా పట్టించుకోకుండా సినిమా చూసేంతలా ఉంటుందని, దీనికి నేను భరోసా అంటూ ఎమోషనల్ గా మాట్లాడారు. హీరో ఆశిష్ గాంధీ ఈ సినిమాతో మంచి సక్సెస్ వస్తుందని ఆశిస్తున్నానని, మీ ఆశీస్సులు కావాలని చెప్పారు. చాలా గ్రాండ్ గా లాంఛ్ చేసిన ఈ ట్రైలర్ ఇప్పుడు నెటిజన్స్ ని, సినీ లవర్స్ ని ఆకట్టుకుంటోంది. ఆశిష్ గాంధీ సరసన ఐశ్వర్యా రాజ్ భకుని హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి మ్యూజిక్ సాయికార్తీక్ అందించారు.


పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Share.