సైలెంట్ గా సర్ప్రైజ్ ఇచ్చిన దర్శకుడు ఇంద్రగంటి..!

టాలీవుడ్లో మంచి అభిరుచి కలిగిన దర్శకుల్లో ఇంద్రగంటి మోహన్ కృష్ణ కూడా ఉంటారు అనడంలో సందేహం లేదు. ‘అష్టా చమ్మా’ నుండీ ఆయన తెరకెక్కించిన సినిమాలు అన్నీ కూడా క్లాస్ ఆడియెన్స్ ను అలరిస్తూనే వచ్చాయి. ‘జెంటిల్మెన్'(నాని) వంటి సస్పెన్స్ థ్రిల్లర్ ను తెరకెక్కించిన ఇంద్రగంటి.. ఆ తరువాత ‘అమీ తుమీ’ వంటి కామెడీ మూవీ అలాగే.. ‘సమ్మోహనం’ వంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీని తెరకెక్కించి పాత్ బ్రేకింగ్ డైరెక్టర్ అని ప్రూవ్ చేసుకున్నాడు.

అయితే తన ఇమేజ్ ను మరింతగా పెంచుకోవాలి అని భావించి ‘వి’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. భారీ అంచనాల నడుమ గతేడాది అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ చిత్రం బాగా నిరాశపరిచింది. ఇంద్రగంటి ఇలా చేశాడేంటబ్బా అనుకోని ప్రేక్షకుడు ఉండడు అనడంలో అతిశయోక్తి లేదు. అయినప్పటికీ ‘వి’ ఎఫెక్ట్ నుండీ అతను తొందరగానే బయటపడే ప్రయత్నం చేస్తున్నాడు. తన శిష్యుడు సుధీర్ బాబుని హీరోగా పెట్టి ఓ మంచి ప్రేమకథని తెరకెక్కిస్తున్నాడు.

‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి ఇందులో హీరోయిన్ కావడం విశేషం. తాజాగా ఈ చిత్రం థీమ్ పై హింట్ ఇచ్చేలా ఓ సర్ప్రైజ్ వీడియోని కూడా విడుదల చేసాడు. ఈ వీడియో చాలా ప్లెజెంట్ గా ఉంది. సుధీర్ బాబు లుక్ మరియు అతని ఎక్స్ప్రెషన్స్ కూడా బాగున్నాయి. మార్చి 1న ఈ చిత్రం టైటిల్ ను విడుదల చెయ్యబోతున్నట్టు కూడా సుధీర్ బాబు ఈ వీడియోలో చెప్పుకొచ్చాడు. ఇక వీడియోని బట్టి.. ఈ సినిమా మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ఏమో అనిపిస్తుంది.


చెక్ సినిమా రివ్యూ & రేటింగ్!
అక్షర సినిమా రివ్యూ & రేటింగ్!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Share.